Peter Nevill: ప్రొఫెషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ పీటర్ నెవిల్
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ తన క్రికెట్ కేరీర్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకుంటున్నట్టు పీటర్ ప్రకటించారు.
Peter Nevill Announces Retirement: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్.. పీటర్ నెవిల్ తన క్రికెట్ కేరీర్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకుంటున్నట్టు పీటర్ తెలిపారు. ఆస్ట్రేలియా తరఫున పీటర్ 17 టెస్టులు, 9 టీట్వంటీలు మాత్రమే ఆడాడు. 2015లో యాషెస్ సిరీస్ తో పీటర్ నెవిల్ తన టెస్టు కేరీర్ ను ప్రారంభించాడు.
2015 లో జరిగిన యాషెస్ కు తొలుత బ్రాడ్ హడిన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. అయితే హడిన్ వ్యక్తిగత కారణాలతో ఆసిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో పీటర్ ఆ సిరీస్ కు ఎంపికయ్యాడు. మొత్తం 17 మ్యాచ్ ల్లో 468 పరుగులు చేసిన పీటర్.. యావరేజ్ 22.28గా ఉంది. 2016లో సౌతాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అటు 9 టీట్వంటీ మ్యాచ్ లు ఆడిన పీటర్.. కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.
2016లో సౌతాఫ్రికా మ్యాచ్ తో టీట్వంటీ లోకి ఎంట్రీ ఇచ్చిన పీటర్.. అదే సంవత్సరం శ్రీలంకతో జరిగిన టీట్వంటీ మ్యాచే చివరిది. అయితే ఇంటర్నేషనల్ తో పోల్చితే ఫస్ట్ క్లాస్ లో పీటర్ నివిల్ గణంకాలు చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయి. కేరీర్ లో 126 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అందులో 5927 పరుగులు చేశాడు. ఇందులో10 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!
Also Read: Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook