RR vs RCB: ఐపీఎల్ 2022లో అత్యంత కీలకమైన క్వాలిఫయర్ 2 ఇవాళ జరగనుంది. రెండు జట్లు స్పిన్నర్లపై ఆశలు పెట్టుకున్న నేపధ్యంలో ఆర్ఆర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై..సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. పిచ్ ఎలా ఉంటుందనే విషయంపై విభిన్న రకాల వార్తలొస్తున్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటే..రెండు జట్లు స్పిన్నర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం అనంతరం ఇవాళ క్వాలిఫయర్ 2లో ఆర్సీబీతో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. క్వాలిఫయర్ 2 జరగనున్న అహ్మదాబాద్ పిచ్‌పై చాలా సందేహాలు వస్తున్నాయి. పిచ్ ఎలా ఉంటుందనేది తెలియడం లేదు. ఒకవేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే..రెండు జట్లు స్పిన్నర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఆర్ఆర్ జట్టులో యజువేంద్ర చాహల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ వేయనున్నాడు. అయితే ఆర్ఆర్ జట్టుకు ఆఫ్ స్పిన్నర్ సమస్యగా మారవచ్చని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు


ఫ్లాట్ ట్రాక్స్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ ఓ సమస్యగా మారవచ్చనేది సంజయ్ మంజ్రేకర్ చెబుతున్న మాట. ఇలాంటి పిచ్‌లపై రవిచంద్రన్ చాలాసార్లు బౌల్ చేసి ఉన్నాడు కానీ బాల్ టర్న్ అయితే మాత్రం ప్రమాదకర బౌలర్ కావచ్చు. అది కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రయోజనకరం కానుంది. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు ఆ జట్టులో ఉన్నారని చెప్పాడు సంజయ్.


ఐపీఎల్ 2022లో 15 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 11 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్ధి జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ వికెట్ తీయడంపై అతను దృష్టి సారిస్తుంటాడు. అదే సమయంలో 185 పరుగులు చేసి మంచి బ్యాట్స్‌మెన్‌గా కూడా మారాడు. ఆర్ఆర్ జట్టుకు డెత్ బౌలింగ్ ఓ బలహీనత. డెత్ ఓవర్స్ కంటే..కొత్త బాల్‌తో ఓపెన్ చేయడమే ఆర్ఆర్ బౌలర్ ట్రెంట్ బోల్ట్‌కు మంచిదని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ కృష్ణ ఉన్నాడు. మరోవైపు ఒబేద్ మెకాయ్ స్పెల్ కూడా బాగుందని చెప్పాడు.


Also read: Virat Kohli Shock: విరాట్ కోహ్లీ కోసం మైదానంలోకి అభిమాని.. పోలీస్ చేసిన పనికి షాకైన కోహ్లీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook