టీమిండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్(77) కన్నుమూశారు.
టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్(77) కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వాడేకర్ ముంబై జన్‌లోక్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. 1971లో టీమిండియాకు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారిగా సిరీస్ విజయాన్ని అందించిన ఆయన.. భారత ఉత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ఏప్రిల్1న 1941లో ముంబైలో జన్మించిన వాడేకర్.. 37 టెస్టులు (2,113పరుగులు), రెండు వన్డేలు (73 పరుగులు) ఆడారు. 1966 నుంచి 1974 మధ్య ఆయన భారత్ తరఫున ఆడారు. 1958లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో అరంగేట్రం చేసిన అజిత్ వాడేకర్ 1966 టెస్ట్ క్రికెటర్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టుకు వాడేకర్ అందించిన సేవలకు గాను అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ అవార్డులతో అప్పటి భారత ప్రభుత్వం సత్కరించింది. వాడేకర్‌కు అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్‌గా పేరుంది. కాగా అజిత్ వాడేకర్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.