Irfan Pathan on Umran Malik: భారత క్రికెట్‌లో జమ్మూకాశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేరు మార్మోగుతోంది. జాతీయ జట్టులో అతడిని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఉమ్రాన్‌ మాలిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం మంచిదికాదంటున్నారు. తాజాగా ఉమ్రాన్‌పై టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. మొదట అతడిని జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయించాలన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాతే టీ20 ప్రపంచకప్‌ గురించి ఆలోచించాలని చెప్పాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో హైదరాబాద్ తరపున ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 22 వికెట్లు తీశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంగా బంతులు సంధించాడు. దీంతో అతడిపై అంచనాలు పెరిగాయి. ఈక్రమంలో సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐతే తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 


ఈక్రమంలోనే ఉమ్రాన్‌ మాలిక్‌ను ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచకప్‌కు ముందే జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుతున్నారు. మరికొందరైతే అప్పుడే ఆడించొద్దని సలహా ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఇర్ఫాన్ పఠాన్‌ స్పందించాడు. వెంటనే అతడిని ఆడించాలన్నాడు. అప్పుడే ఉమ్రాన్‌ జాతీయ జట్టుకు పనికి వస్తాడా లేదా అన్న తెలుస్తుందని చెప్పాడు.


ఇప్పటివరకు మన దేశంలో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్ లేరని..ఇప్పుడు అలాంటి ఆటగాడు దొరికాడని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. అతడిని మనం దీర్ఘకాలం రాణించేలా కాపాడుకోవాలని సలహా ఇచ్చాడు. బాగా రాణించిన తర్వాతే ఉమ్రాన్ మాలిక్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలన్నాడు. అతడిని ఐర్లాండ్‌ టూర్‌కు సైతం ఎంపిక చేశారు. హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు..ఈనెల 26,28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈమ్యాచ్‌లోనైనా అతడికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. మరోవైపు ఉమ్రాన్‌ మాలిక్‌కు బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠానే శిక్షణ ఇచ్చాడు.


Also read:Janmashtami 2022: నేడే జన్మాష్టమి.. సంతానం కలగాలంటే శ్రీకృష్ణుడిని ఈ విధంగా పూజించండి!  


Also read:Chandra Babu on CM Jagan: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు పిరికితనానికి నిదర్శనం..సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook