Dinesh Karthik: ప్రపంచకప్ ఆడటమే లక్ష్యం.. సెలెక్ట్ కాకపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు: దినేష్ కార్తీక్

IND vs SA, Dinesh Karthik wants to play T20 World Cup 2022. టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. 2022 టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 11:58 PM IST
  • ప్రపంచకప్ ఆడటమే లక్ష్యం
  • సెలెక్ట్ కాకపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు
  • 27 బంతుల్లో 55 రన్స్
Dinesh Karthik: ప్రపంచకప్ ఆడటమే లక్ష్యం.. సెలెక్ట్ కాకపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు: దినేష్ కార్తీక్

Dinesh Karthik says I want to play T20 World Cup 2022: టీమిండియా వెటరన్ వికెట్‌ కీపర్‌, బ్యాటర్ దినేశ్‌ కార్తీక్‌ పని ఇక అయిపోయిందనుకున్న తరుణంలో భారత జట్టులోకి గొప్పగా పురాగమనం చేశాడు. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 రన్స్ చేశాడు. 15వ సీజన్‌లో కీపర్‌, బ్యాటర్‌గా డీకే రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. దక్కించుకోవడమే కాదు.. ఐపీఎల్ 2022 ఫామ్ కనబర్చుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. 

శుక్రవారం రాత్రి దక్షిణఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దినేశ్‌ కార్తీక్‌ సూపర్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు మంచి స్కోరు అందించాడు. 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 55 రన్స్ చేసి.. టీ20 కెరీర్‌లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. అంతేకాదు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కూడా అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతూ.. 2022 టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. 

'టీ20 ప్రపంచకప్ 2022 ఆడాలని నిర్ణయించుకున్నా. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైనది. చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నా కాబట్టి.. భారత జట్టుకు సెలెక్ట్ కాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు.  టీమిండియా కోసం ఆడటానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. అదృష్టం కొద్దీ బెంగళూరు జట్టు నాకు ఓ అవకాశం ఇచ్చింది. నాకంటూ ప్రత్యేకంగా ఒక రోల్ ఇచ్చింది. దాని కోసమే నేను ప్రాక్టీస్ చేశా. ఫలితంగా ఇక్కడ ఉన్నా. కఠిన మ్యాచుల్లో టీమిండియాను గెలిపించాలనేది నా కోరిక. భారత జట్టులో భాగంగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు' అని డీకే చెప్పాడు. 

2019 వన్డే ప్రపంచకప్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఆడిన ప్రదర్శనపై చాలా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీ ఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులే చేశాడు. అప్పటి నుంచి దక్షిణాఫ్రికా సిరీస్ వరకు డీకేను భారత్ జట్టులోకి తీసుకోలేదు. ఐపీఎల్ 2022 పుణ్యమాని జట్టులోకి వచ్చి ఇరగదీస్తున్నాడు. డీకే భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఇక 229 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

Also Read: Poonam Bajwa Pics: బ్లాక్ డ్రెస్సులో పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలు చూడతరమా!

Also Read: Mango-Weight Loss: మామిడి పండుతో సునాయాసంగా బరువు తగ్గొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News