SR Patil Dies: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
మహారాష్ట్రకు చెందిన భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్‌జీ (86) కన్నుమూశారు. ఎస్ఆర్ పాటిల్‌గా పిలుచుకునేవారు. మంగళవారం ఉదయం నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారని (Cricketer SR Patil Dies) క్రికెట్ సంఘం తెలిపింది.
భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్‌జీ పాటిల్(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన మహారాష్ట్ర, కొల్హాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు (Former Indian Cricketer SR Patil Dies). ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ క్రికెటర్ ఎస్ఆర్ పాటిల్ మృతిపట్ల బీసీసీఐ సంతాపం ప్రకటించింది. Oxford Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
తెల్లవారుజామున నిద్రలోనే సదాశివ్ రావ్‌జీ కన్నుమూశారని జిల్లా క్రికెట్ అధికారులు తెలిపారు. పేస్ బౌలర్, బ్యాట్స్‌మన్ గానూ రాష్ట్ర క్రికెట్‌లో రాణించిన ఎస్ఆర్ పాటిల్ 1955లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడారు. రంజీల్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవారు. 12 ఏళ్లపాటు మహారాష్ట్ర రాష్ట్ర బోర్డు తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఆల్ రౌండర్‌గా రాణించారు. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..