ఆక్స్‌ఫర్డ్ కోవిడ్19 వ్యాక్సిన్ (Oxford COVID-19 vaccine) క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించనుంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశ, మూడో దశ ప్రయోగాలను కొనసాగించేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమతి ఇవ్వడం హర్షదాయకం. Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం..
ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా వేయించుకున్న బ్రిటన్ వాలంటీర్‌కు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఇటీవల క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని డీసీజీఐ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆదేశించింది. దీనిపై కమిటీ వేయగా.. సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని తేలింది. Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బ్రిటన్‌లో ఇదివరకే క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ట్రయల్స్ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (MHRA)కు నిపుణుల కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు సైతం క్లినికల్ ట్రయల్స్ కొనసాగించేందుకు అనుమతి లభించింది.
ఫొటో గ్యాలరీలు
- Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR