Gautam Gambhir Reacts On Virat Kohli Issue: ఈ సీజన్ ఐపీఎల్‌లో హైలెట్ అయిన విషయం ఏదైనా ఉందంటే.. విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్ మధ్య గొడవే.. లక్నో సూపర్ జెయింట్స్‌ మెంటర్‌గా గంభీర్ ఉండగా.. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీతో వాగ్వాదం నడిచింది. ఈ విషయంలో బీసీసీఐ కూడా సీరియస్ అయి.. ఇద్దరికి 100 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత పెట్టింది. అదేవిధంగా గౌతమ్ గంభీర్-మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. కోహ్లీ, ధోనీతో విభేదాలపై గౌతమ్ గంభీర్ స్వయంగా సమాధానం ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో తన రిలేషన్‌షిప్‌ను పంచుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదన్నాడు గంభీర్. తమ మధ్య వాగ్వాదం జరిగితే.. అది గ్రౌండ్‌ వరకే ఉంటుందన్నాడు. మైదానం బయట వ్యక్తిగతంగా ఏమి లేదన్నాడు. తామ మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. తామంతా గెలవాలనే కసితో ఆడతామని చెప్పాడు. టీమిండియా వరుసగా ఐసీసీ టోర్నీలు ఓడిపోవడంపై ఈ మాజీ వెటరన్ స్పందించాడు. 


మన దేశంలో టీమ్‌ఫస్ట్‌ స్పిరిట్‌ లేదని.. జట్టుకు బదులు వ్యక్తిగత ఆటగాడికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. జట్టు కంటే ఆటగాడే ఎక్కువ అని అనుకుంటామని.. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అలా కాదన్నాడు. జట్టు కంటే ఏ వ్యక్తికీ ప్రాముఖ్యత ఇవ్వకూడదన్నాడు. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఫ్లాప్ కావడానికి ఇదే కారణమని తెలిపాడు.


డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత పదేళ్లు ఐసీసీ టోర్నీని గెలవాలనే భారత్ కల చెదిరింది. టీమిండియా చివరగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచింది. అప్పటి నుంచి కెప్టెన్లు మారుతున్నా.. ప్లేయర్లు మారుతున్నా టీమిండియా చేతికి మాత్రం ఐసీసీ ట్రోఫీ అందడం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌ను భారత్ గెలిస్తే.. నిరీక్షణకు తెరపడుతుంది. 


Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  


Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి