టీమిండియా విదేశాల్లో సత్తా విదేశాల్లోనూ బయటపడుతుందని ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్‌ అన్నాడు. ఇటీవలే టీమిండియా పర్ఫార్ మెన్స్ పై స్పందిస్తూ .. టీమిండియా స్వదేశంలో ఎప్పటికీ బలమైన జట్టేనన్నాడు. కోహ్లీ నాయత్వంలో టీమిండియా అద్భుతంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ తో పాటు నాణ్యమైన పేస్, స్పిన్ బౌలింగ్ తో జట్టు ఆకట్టుకుంటోందని చెప్పాడు అయితే విదేశాల్లో రాణించినప్పుడే జట్టు సత్తా బయటపడుతుందన్నారు. త్వరలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన వెళ్లనుంది కనుక అక్కడ ఏంజరుగుతుందో చూద్దామని ఆసక్తి వ్యక్తం చేశాడు.  


పాటింగ్ తో  కోహ్లీని పోల్చలేం...
కోహ్లీని ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ తో పోల్చడాన్ని గిల్ క్రిస్ట్ తప్పుబట్టాడు. ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం మాజీలతో ప్రస్తుత ఆటగాళ్లను పోల్చడం తప్పని హితవు పలికాడు. కఠిన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా కోహ్లీ జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని అన్నాడు. కోహ్లీ జట్టును నడిపించే తీరు తనను బాగా ఆకట్టుకుంటోందని గిల్లీ చెప్పాడు.  కోహ్లీ  కెప్టెన్సీలో స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని... విదేశాల్లో అదే స్థాయిలో విజయాలను అందుకోవాలని ఆసీస్ క్రికెట్ దిగ్గజం గిల్ క్రిస్ట్ ఆకాంక్షించాడు‌.