టైగర్ వుడ్స్ ఎంత గొప్ప గోల్ఫ్ ప్ర్లేయరో మనకు తెలియని విషయం కాదు. గోల్ఫ్ ఆటగాళ్ళల్లో లెజెండరీ స్థాయి ఘనతను సొంతం చేసుకున్న మేటి ఆటగాడు. ఇటీవలే ఆయన తన జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో తనకు తానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన అంతటితోనే సరిపెట్టుకోలేదు. ఆ రోజు తాను చేపల వేటకు వెళ్లానని.. రెండు పెద్ద చేపలను సైతం పట్టుకొన్నానని ఆనందంగా చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో బాగా వైరల్ అవుతున్నాయి.


41 ఏళ్ల టైగర్ వుడ్స్ అనేక సంవత్సరాలుగా గోల్ఫ్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగారు. తన కెరీర్‌లో మొత్తం 79 పీజీఏ టూర్లతో పాటు 40 యూరోపియన్ టూర్లలో విజయాలను కైవసం చేసుకున్నారు.