IPL 2020: ఐపీఎల్ 2020 ఈ సారి యూఏఈలో ( IPL 2020 In UAE ) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన అరబ్ ప్రభుత్వం ఐపీఎల్ అభిమాలను సంతోషపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. క్రికెట్ అభిమానులకు (Cricket Lovers ) గుడ్ చెప్పేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రయత్నిస్తోంది. కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus ) నేపథ్యంలో కేవలం టీవీల్లోనే మ్యాచులు చూడాల్సి వస్తుంది అనుకున్న అభిమానులకు స్డేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also: Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు 
యూఏఈలో ప్రస్తుతం కరోనావైరస్ అదుపులో ఉంది. దీనికి గమనించి ఐపీఎల్ ( IPL 13 ) మ్యాచులను క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇస్తామని క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. క్రికెట్ స్టేడియంలో మొత్తం 30 నుంచి 50 శాతం సీటింగ్ కెపాసిటీని అభిమానుల ( IPL Fans ) కోసం అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని తలిపారు. అయితే దీనినిపై అక్కడి ప్రభుత్వంతో పాటు బీసీసీఐ ( BCCI ) ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. అనుమతి లభిస్తే అభిమానులు క్రికెట్ పండగ చేసుకుంటారు.


Read This Story :Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు