Ravindra Jadeja: నీ అమ్మ అంటూ.. కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా (వీడియో)!
Ravindra Jadeja Angry on Shivam Dube. శివమ్ దుబే కీలక క్యాచ్ మిస్ చేయడంతో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జడేజా తన క్యాప్‌ను తీసి నెలకేసి కొట్టబోయాడు.
Ravindra Jadeja Angry on Shivam Dube after Drops David Miller Catch: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (73; 48 బంతుల్లో 5×4, 5×6), అంబటి రాయుడు (46; 31 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. లక్ష్యాన్ని గుజరాత్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మిల్లర్ (94 నాటౌట్; 51 బంతుల్లో 8×4, 6×6) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచులో చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా ఆగ్రహానికి గురయ్యాడు.
గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 బంతుల్లో 50 పరుగులు చేయాలి. 17 ఓవర్ మూడో బంతిని చెన్నై పేసర్ డ్వేన్ బ్రావో స్లో డెలివరీ వేయగా.. డేవిడ్ మిల్లర్ డీప్ మిడ్ వికెట్ దిశగా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో డిప్ మిడ్ వికెట్‌లో గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దుబే.. ఫ్లడ్ లైట్‌ల కారణంగా కనీసం బంతిని పట్టే ప్రయత్నం కూడా చేయలేదు. బంతికి కొద్దిదూరంలో ఆగిపోయాడు. దాంతో మిల్లర్ బతికిపోయాడు.
శివమ్ దుబే కీలక క్యాచ్ మిస్ చేయడంతో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జడేజా తన క్యాప్‌ను తీసి నెలకేసి కొట్టబోయాడు. అయితే తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని.. 'నీ అమ్మ అంటూ' కోపంతో ఊగిపోయాడు. ఈ సమయంలో మిల్లర్ 41 బంతుల్లో 78 పరుగులు చేశాడు. చివరకు 51 బంతుల్లో మిల్లర్ 94 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. జడేజా అసహనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కెమెంట్లు చేస్తున్నారు.
Also Read: Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యం
Also Read: EPF Nomination Benefits: EPFO ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే రూ.7 లక్షల బీమా కోల్పోయినట్టే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook