GT vs PBKS Highlights: శుభ్‌మన్‌ గిల్‌ వీరకుమ్ముడు కుమ్మినా గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి బాట నుంచి బయటపడలేదు. టాపార్డర్ కుప్పకూలిన దశలో శశాంక్‌ సింగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో 200 లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ఛేదించి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఓటముల నుంచి తేరుకుని గుజరాత్‌ నుంచి మ్యాచ్‌ను పంజాబ్‌ చేజిక్కించుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పీబీకేఎస్‌ మూడు వికెట్ల తేడాతో జీటీపై విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Uppal Stadium: హైదరాబాద్‌ Vs చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక పరిణామం.. ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్‌ బంద్‌

టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 200 లక్ష్యాన్ని సాధించి సత్తా చాటింది. టాపార్డర్లు కుప్పకూలిన వేళ మిడిలార్డర్‌లో వచ్చిన శశాంక్‌ సింగ్‌ గెలుపు ధీమాతో ఉన్న గుజరాత్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఆరో స్థానంలో వచ్చినా కూడా జట్టును విజయతీరాలకు చేర్చిన విధానం చూస్తే అభినందించకుండా ఉండలేం. 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్‌ కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఒక్క పరుగుకే మైదానం వీడగా.. జానీ బైర్‌స్టో (22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ (35) బ్యాట్‌తో పర్వాలేదనిపించారు.


Also Read: DC Vs KKR Live Score: ఐపీఎల్‌లోనే రెండో అత్యధిక స్కోర్‌.. సునీల్‌ నరైన్‌ ఊచకోతతో కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయం


వారిద్దరూ పెవిలియన్‌ చేరిన తర్వాత నిమిషాల వ్యవధిలో బ్యాటర్లు మైదానం వీడారు. సామ్‌ కరాన్‌ (5), సికిందర్‌ రాజ (15), అషుతోష్‌ శర్మ (31) వరుసగా ఔటైన సమయంలో ఆరో స్థానంలో శశాంక్‌ సింగ్‌ బ్యాట్‌ పట్టాడు. అప్పటికే ఓటమి ఖరారు చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌లో తన బ్యాట్‌తో ఆశలు రేపి చివరకు విజయాన్ని అందించాడు. 29 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో రెచ్చిపోయాడు. అయితే ఫీల్డర్లు రెండు క్యాచ్‌లను మిస్‌ చేయడం శశాంక్‌కు అదృష్టంగా మారింది.


ఛేదనకు దిగిన పంజాబ్‌ను 15 ఓవర్ల వరకు గుజరాత్‌ బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్‌ వేశారు. కానీ చివరి ఐదు ఓవర్లు మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, దర్శన్‌ నల్కడే ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు. బౌలింగ్‌లో సమష్టి కృషి ప్రదర్శించినా చివరివరకు నిలబెట్టుకోలేదు. మ్యాచ్‌ చేజార్చుకోవడంలో బౌలర్ల తప్పిదం లేదు. ఫీల్డింగ్‌ విషయంలో దొర్లినా తప్పులు ఫలితం తారుమారైంది. ముఖ్యంగా శశాంక్‌ సింగ్‌కు చెందిన రెండు క్యాచ్‌లు మిస్‌ చేసుకోవడం జట్టును ఓటమి బాట పట్టించింది.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తో బంతిపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి జట్టుకు భారీ పరుగులు ఇచ్చాడు. వృద్ధిమాన్‌ సాహ (11), విజయ్‌ శంకర్‌ (8) పరుగులు రాబట్టడంలో విఫలమవగా.. సాయి సుదర్శన్‌ (33), కేన్‌ విలియమ్సన్‌ (26), రాహుల్‌ తెవాటియా (23) పర్వాలేదనిపించారు.

కొంపముంచిన మిస్ ఫీల్డ్
బౌలింగ్‌ విషయానికి వస్తే పంజాబ్‌ బౌలర్లు నిలకడైన బంతులు వేస్తూనే వికెట్లు తీసేందుకు ప్రయత్నించారు. కానీ మైదానంలో పాతుకుపోయిన గిల్‌ను మాత్రం ఔట్‌ చేయలేకపోయారు. కగిసో రబాడ రెండు వికెట్లు, హర్షల్‌ పటేల్‌, హర్‌ప్రీత్ బ్రార్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో హ్యాట్రిక్‌ ఓటముల నుంచి పంజాబ్‌ తప్పుకోగా.. గుజరాత్‌ రెండో ఓటమిని చవిచూసింది. మరి శుక్రవారం హైదరాబాద్‌ వేదికగా జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ చూసేందుకు సిద్ధమైపోండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి