Hardik pandya Video Viral: ఐపీఎల్ 2022లో నిన్న జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. ప్రతి ఒక్కరిపై విసుగు ప్రదర్శిస్తూ..సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ షమీపై కేకలు వేసి..విమర్శల పాలవుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్. ఏదో టీమ్ ఇండియా కెప్టెన్‌లా ఫీలయిపోతున్నాడు. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో అతని ప్రవర్తన, మేనరిజం అంతా ట్రోలింగ్ అవుతోంది. ముఖ్యంగా టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్, గుజరాత్ టైటాన్స్ టీమ్ తోటి ఆటగాడైన మొహమ్మద్ షమీపై హార్ధిక్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శనాత్మకంగా ఉంది.


గుజరాత్ టైటాన్స్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అవలీలగా ఛేధించింది. ఈ క్రమంలో గ్రౌండ్‌లో హార్దిక్ పాండ్యా అసహనం కోల్పోయి వ్యవహరించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను కెప్టెన్ హార్జిక్ పాండ్యా స్వయంగా వేశాడు. ఆ ఓవర్‌లో వరుసగా 2,3 బంతుల్ని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ విలియమ్సన్ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్ చివరి బంతిని రాహుల్ త్రిపాఠీకు వేశాడు. త్రిపాఠీ ఆ బంతిని పై నుంచి కట్ చేయగా..అది కాస్తా డీప్ ధర్డ్‌మ్యాన్ వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో కాస్త మందుకెళ్లి ప్రయత్నిస్తే క్యాచ్ రావచ్చు..రాకపోవచ్చు. ఒకవేళ ఆ రిస్కీ క్యాచ్ మిస్సయితే బౌండరీ ఖాయం. అది ఆలోచించిన మొహమ్మద్ షమీ..క్యాచ్ కోసం ట్రై చేయకుండా బౌండరీ కాకుండా కాపాడాడు. ఇది చూసిన హార్దిక్ పాండ్యా..ఇంకేం ఆలోచించకుండా గ్రౌండ్ నుంచి మొహమ్మద్ షమీపై కేకలు వేశాడు. 


హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు హార్దిక్ పాండ్యాపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీనియర్ ప్లేయర్‌పై వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..కెప్టెన్‌గా పనికిరావు అంటూ కామెంట్లు అందుకున్నారు. ఆ వీడియో మీరూ చూడండి..



Also read: SRH vs GT: గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్, ఎస్ఆర్‌హెచ్‌ రెండవ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook