Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ బర్త్‌డే, టీమిండియా మాజీ కెప్టెన్‌కు శుభాకాంక్షల వెల్లువ
Happy Birthday MS Dhoni: ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టెస్టు విజయాలు, 110 వన్డే విజయాలు, 27 టీ20 విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌లో 17,226 పరుగులు సాధించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Happy Birthday MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. టీమిండియా అభిమానులతో పాటు ధోనీ ఫ్యాన్స్, సహచర, మాజీ క్రికెటర్లు మహేంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహీ బర్త్‌డే విషెస్‌తో సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ (2007), వన్డే ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథిగా మూడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిపాడు. గత ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ (టీ20లు, వన్డేలు)కు వీడ్కోలు పలికాడు. ధోనీ (MS Dhoni Birthday) రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలో సురేష్ రైనా సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంఎస్ ధోనీకి సురేష్ రైనా బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే ధోనీ, నువ్వు నాకు స్నేహితుడు, సోదరుడు, మెంటార్‌గానూ వెంట నిలిచావు. మరింత కాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ’ సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘లెజెండ్ మరియు స్ఫూర్తివి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని బీసీసీఐ విషెస్ తెలిపింది.
మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తనదైనశైలిలో ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఎలా నెగ్గాలో యువతకు నేర్పించాడు. కానీ నువ్వు దాన్ని అలవాటుగా మార్చావు. ఇండియన్ క్రికెట్‌ను ఓ గాడిన పడేసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని కైఫ్ ట్వీట్ చేశాడు.
టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్ ధోనీ హయాంలోనే మొదలైంది. ధోనీ తెలివితేటలు, కెప్టెన్సీతో పలు సిరీస్‌లలో లంబూ భారత జట్టుకు విజయాలు అందించాడు. మహీ భాయ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్‌డే. గొప్ప స్నేహితుడైన కెప్టెన్. ఈ ఏడాది నీకు మరింత మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ఎంఎస్ ధోనీకి బర్త్‌డే విషెస్ తెలిపాడు పేసర్ ఇషాంత్ శర్మ.
సూపర్ బర్త్‌డే టు నమ్మ #Thala ఎంఎస్ ధోనీ ఒకేఒక్కడు, ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తివి. తలా తలా అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టెస్టు విజయాలు, 110 వన్డే విజయాలు, 27 టీ20 విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌లో 17,226 పరుగులు సాధించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook