IPL-2020: సీఎస్కే జట్టుకు మరో దెబ్బ.. ఐపీఎల్‌కు భజ్జీ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
Harbhajan Singh pulls out of IPL-2020: న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా వైదొలిగాడు. ఇటీవల ఐపీఎల్ నుంచి భజ్జీ తప్పుకుంటున్నాడని వార్తలు వచ్చినా.. దీనిని సీఎస్కే యాజమాన్యం ఖండించింది. అయితే తాజాగా ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్‌లో పాల్గొనలేనని హర్భజన్ సింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ మేనెజ్మెంట్కు స్పష్టం చేసినట్లు సమాచారం. Also read: Ravichandran Ashwin: జీవితంలో అవి అత్యంత చెత్త రోజులు
ఇదిలాఉంటే. భారత్ నుంచి యూఏఈ వెళ్లిన చెన్నై టీమ్‌తో పాటు హర్బజన్ వెళ్లలేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్తాడని యాజమాన్యం ప్రకటించినప్పటికీ.. ప్రాక్టిస్ చేస్తున్న జట్టులో హర్భజన్ చేరలేదు. ఈ క్రమంలో హర్భజన్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొందని పలువురు పేర్కొంటున్నారు. Also read: IPL 2020 schedule: ఐపిఎల్ 2020 పూర్తి షెడ్యూల్ రెడీ