IPL 2020 schedule: ఐపిఎల్ 2020 పూర్తి షెడ్యూల్ రెడీ

ఐపిఎల్ 2020 యూఏఈ పూర్తి షెడ్యూల్ శుక్రవారం.. అంటే నేడే విడుదల కానున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ( Sourav Ganguly ) గురువారం వెల్లడించారు. ఈ నెల 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ ( IPL 13th season ) జరగనుందనే సంగతి అందరికీ తెలిసిందే.

Last Updated : Sep 4, 2020, 02:35 AM IST
  • IPL 2020 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలపై గంగూలీ వ్యాఖ్యలు
  • యూఏఈ షెడ్యూల్ విడుదల చేసేందుకు సమయం ఆసన్నమైందన్న గంగూలీ
IPL 2020 schedule: ఐపిఎల్ 2020 పూర్తి షెడ్యూల్ రెడీ

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2020 యూఏఈ పూర్తి షెడ్యూల్ శుక్రవారం.. అంటే నేడే విడుదల కానున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ( Sourav Ganguly ) గురువారం వెల్లడించారు. ఈ నెల 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ ( IPL 13th season ) జరగనుందనే సంగతి అందరికీ తెలిసిందే కానీ పూర్తి షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు రాకపోవడంతో ఐపిఎల్ అభిమానుల ( IPL fans ) దృష్టి అంతా ప్రస్తుతం ఈ షెడ్యూల్‌పైనే ఉంది. ఇదే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ.. ఇప్పటికే షెడ్యూల్‌ ఆలస్యమైందని తెలుసునని అన్నారు. '' కొత్త షెడ్యూల్‌ని డిజైన్ చేసే ప్రక్రియ పూర్తయిందని.. రేపటి శుక్రవారంలోగా ఐపిఎల్ షెడ్యూల్‌ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరబ్ గంగూలీ ఈ వివరాలు వెల్లడించారు. Also read : SLPL schedule: 5 క్రికెట్ జట్లు.. 15 రోజుల టీ20 టోర్నమెంట్

Coronavirus కారణంగా మార్చిలో జరగాల్సి ఉన్న IPL 2020 వాయిదా పడుతూ రావడం, ఆ తర్వాత యూఏఈ వేదికగా ఐపిఎల్ మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించడం తెలిసిన సంగతే. ఐసీసీ విధించిన కొవిడ్-19 నిబంధనలను ( COVID-19 rules ) పాటిస్తూ ఐపిఎల్ 2020 నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అబు ధాబి, దుబాయ్, షార్జా స్టేడియంలు ఈ మ్యాచులకు వేదికలు కానున్నాయి. Also read : Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!

ఆసక్తికరమైన మరిన్ని కథనాల కోసం : 

Trending News