Harbhajan Singh: రాజకీయాల్లోకి ఎంట్రీపై హర్భజన్ సింగ్ క్లారిటీ- సిద్ధూను కలిసింది ఎందుకంటే?
Harbhajan Singh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హర్భజన్ సింగ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తానకు వివిధ పార్టీల నుంచి పిలుపు వచ్చినట్లు చెప్పాడు. పార్టీలో చేసే విషయంపై భజ్జీ ఏం చెప్పాడండే..
Harbhajan Singh: హర్భజన్ సింగ్ తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంపై స్పందించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి శుక్రవారమే రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ తాజాగా తన భవిష్యత్ కార్యచరణపై (Harbhajan Singh on his future Plans) మాట్లాడాడు. ఈ మేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు.
హర్భజన్ సింగ్ ఏం చెప్పాడంటే..
'నాకు అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉంది. వివిధ పార్టీల నుంచి ఆహ్వానం కూడా వచ్చింది. నేను పంజాబ్‌కు సేవల చేయాలి. అది రాజకీయాల ద్వారా కావచ్చు. వేరే విధంగా కావచ్చు. ఇంకా దీనిపై నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక వేల నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. పార్టీలో చేరే ముందే ప్రకటిస్తాను.' అని హర్భజన్ తాజాగా (Harbhajan Singh on his Political Entry) స్పష్టతనిచ్చాడు.
కొంత కాలంగా రూమర్స్..
హర్భజన్ సింగ్ రాజకీయాల్లోకి వస్తాడని.. గత కొంత కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. రిటైర్మెంట్ (Harbhajan Singh retirement) తర్వాత తను బీజేపీలో చేరుతాడని ఇటీవల వార్తలు వచ్చాయి. వాటన్నింటిని భజ్జీ కొట్టిపారేస్తూ వచ్చాడు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజోత్‌సింగ్ సిద్ధూను కలిశాడు హర్భజన్. వీరిద్దరి భేటీతో భజ్జీ కాంగ్రెస్‌లో చేరుతాడనే వాదనకు బలం చేకూర్చింది. దీనిపై ఇరువురు అధికారికంగా ఎలాంటి ప్రకట చేయలేదు. అయితే ఈ విషయంపై హర్భజన్ తాజాగా స్పష్టతనిచ్చాడు. తాను క్రికెటర్‌గానే సిద్ధూని కలిసినట్లు తెల్చి (Harbhajan Singh met Congress chief Navjot Singh Sidhu) చెప్పాడు.
భజ్జీ పొలిటికల్ ఎంట్రీపై ఎందుకన్ని రూమర్స్?
హర్భజన్ సింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే.. రూమర్స్ రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. మరికొన్ని నెలల్లోనే పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అతడు రాజకీయాల్లోకి వచ్చే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే భజ్జీ రిటైర్మెంట్ ఇచ్చినట్ల కూడా చర్చ సాగుతోంది.
ఏదేమైనప్పటికీ.. ప్రస్తుతానికి హర్భజన్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం.. ఎన్నికల ప్రక్రియ మొదలవకముందే ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
Also read: Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook