హర్భజన్ సింగ్ ( Harbhajan Singh ) కేరీర్‌లో 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ టర్నింగ్ పాయింట్. అక్కడే భజ్జీ హ్యాట్రిక్ వికెట్లు ( Harbhajan Singh Hat Trick ) సాధించిన తొలి భారతీయ బౌలర్ అయ్యాడు. బ్యాట్స్‌మన్, బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. హర్భజన్ అప్పటికే ఐదు సార్లు రికీ పాంటింగ్‌‌ను ( Ricky Ponting ) ఔట్ చేశాడు. పాంటింగ్‌కు దాంతో హర్భజన్ అంటే బాగా కోపం పెరిగింది. ఒకానొక సందర్భంలో రికీ పాంటింగ్ ఎంత అసహనానికి గురయ్యాడు అంటే భజ్జీ వైపు కోపంగా దూసుకొచ్చాడట.  పాంటింగ్ చేతిలో బ్యాట్‌ను చూసి దానితో కొట్టేస్తాడేమో అని భయం వేసింది అని హర్భజన్ స్వయంగా తెలిపాడు. Also Read : సచిన్ స్ట్రైకింగ్ ఎందుకు తీసుకోడు.. సీక్రెట్ చెప్పిన గంగూలీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అలా పాంటింగ్‌ను ఔట్ చేసేవాడిని..


ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ అనే షోలో మాట్లాడిన హర్భజన్ టర్భోనేటర్ ( Harbhajan Turbonator ) పాంటింగ్‌ను తొలిసారి షార్జాలో ( Sharjah ) ఔట్ చేశాని తెలిపాడు. ఆ సమయంలో పాంటింగ్‌ను ఏదో అన్నాడు భజ్జీ. అయితే అప్పట్లో భజ్జీకి ఇంగ్లిష్ అంతగా వచ్చేది కాదట..అక్కడా ఇక్కడా విన్న నాలుగు మాటలను అన్నాడట. అది విన్న పాంటింగ్‌కు విపరీతమైన కోపం వచ్చి ముందుకు దూసుకొచ్చాడు. ఆ రోజు పాంటింగ్ బ్యాట్‌తో కొట్టేస్తాడేమో అని అనుకున్నాడట హర్భజన్. అప్పటి నుంచి పాంటింగ్ తను విసిరే బంతి కన్నా ఎక్కువగా ముఖం చూసి బ్యాటింగ్ చేసేవాడు అని.. దాంతో మరిన్ని సార్లు ఔట్ చేసే ఛాన్స్ దొరికింది అని తెలిపాడు భజ్జీ.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..