Hardik Pandya Fitness: సిక్సులను సునాయాసంగా కొట్టే హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
Hardik Pandya Fitness and Diet. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమించాడు. హార్దిక్ డైట్, ఫిట్‌నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Hardik Pandya Fitness and Diet scret: హార్ధిక్ పాండ్యా.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాలో చోటు కోసం ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నింటినీ తట్టుకుని.. తన ఆటతో జట్టులో సుస్థిర సంపాదించాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనంతరం సమయం వచ్చినప్పుడలా ఫినిషర్ రోల్ పోషిస్తూ.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటాడు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్యా ముందుగా బంతితో (3/25) మాయ చేశాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో (33 నాటౌట్; 17 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్.. రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి భారత్‌ను విజయంవైపు నడిపించాడు. జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి ఔట్ అయినా.. నాలుగో బంతికి సిక్స్ బాది అద్భుత విజయం అందించాడు. హార్దిక్ సిక్సర్ కొట్టగానే స్టేడియంతో పాటు దేశం మొత్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
2016లో జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. ఆనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. ఏడాదిన్నరకే టెస్టు జట్టులో అడుగు పెట్టాడు. రెండేళ్లలో ప్రధాన ఆటగాళ్లలో ఒకడయ్యాడు. అయితే 2019లో మహిళలపై అయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో జట్టుకు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక అదే ఏడాది వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్.. ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమించాడు. ఫిట్‌గా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకున్నాడు. నిత్యం వర్కౌట్ చేశాడు. ఇప్పుడు హార్దిక్ పూర్తి ఫిట్‌గా మారాడు. అయితే అతడి డైట్, ఫిట్‌నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్ మెను:
హార్ధిక్ పాండ్యా ప్రతిరోజు వర్కౌట్స్, యోగా చేస్తుంటాడు. ఎక్కువగా వార్మప్ వ్యాయామాలను ఇష్టపడుతాడు. శరీరంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ డ్రిల్ చేస్తాడు. జిమ్‌లో నిత్యం కష్టపడతాడు. అల్పాహారంలో ప్రొటీన్ కోసం ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్ సోయా బిన్స్ తీసుకుంటాడు. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం కూడా తింటాడు. అల్పాహారం అనంతరం గ్రీన్ టీ, కాఫీ లేదా జ్యూస్ తాగుతాడు.
లంచ్, డిన్నర్ మెను:
మధ్యాహ్న భోజనంలో రోటి, అన్నం, పెరుగు, కూరగాయలు, పప్పు తీసుకుంటాడు. ఆయిల్ తక్కువగా ఉండేలా చూసుకుంటాడు. రాత్రి భోజనంలో పప్పు, అన్నం, సలాడ్స్, సూప్, చికెన్, పన్నీర్ తింటాడు. డిన్నర్ అనంతరం సమయానికి నిద్రపోతాడు. ఇక బిత్యం మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాడు.
Also Read: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
Also Read: Cholesterol Tips: అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. సులభమైన ఆయుర్వేద చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి