Hardik Pandya to marry again wife Natasha Stankovic on Valentines Day 2023: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదేంటి పాండ్యాకు ఇప్పటికే బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు కదా?.. పాండ్యా, నటాషాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు కదా?.. పాండ్యా ఎప్పుడు విడాకులు తీసుకున్నాడు.. కొత్త పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి. విషయం ఏంటంటే.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని పాండ్యా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ ప్రేమించుకున్నారు. 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లోని సముద్రంలో విహరిస్తూ నటాషా చేతికి పాండ్యా ఉంగరం తోడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. నటాషా కూడా పాండ్యా ప్రేమను అంగీకరించింది. ఉంగరం తొడిగి ఎంగేజ్‌మెంట్‌  అయిందని కూడా భారత ప్లేయర్ పేర్కొన్నాడు.ఆపై కుటుంబ సభ్యుల సమక్షంలో నటాషాను పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. ఇక 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భవతి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 2020 జులైలో నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు అగస్త్య పాండ్యా. 


2020 లాక్‌డౌన్‌లో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో సంప్ర‌దాయబద్దంగా ఇంకోసారి వివాహం చేసుకోవాల‌ని పాండ్యా అప్పటినుంచే భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 14న హార్దిక్-న‌టాషాలు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారట. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈరోజు (ఫిబ్రవరి 13) నుంచి ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయట. వెడ్డింగ్‌ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ కార్యక్రమాలతో హార్దిక్, నటాషా పెళ్లి వైభవంగా జరగనుందట. 


గుజరాత్‌కు చెందిన 29 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు, 71 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 1518, పొట్టి క్రికెట్‌లో 1271 పరుగులు చేశాడు. మరోవైపు ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' సినిమాతో నటాషా స్టాంకోవిచ్‌ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. హిందీ బిగ్‌బాస్‌ 8లో పాల్గొన్న తరవాత ఆమెకు క్రేజ్‌ పెరిగింది. బిగ్‌బాస్‌ అనంతరం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌, సినిమాలలో నటించారు. 


Also Read: Jemimah Rodrigues Price: జాక్‌ పాట్‌ కొట్టిన జెమియా రోడ్రిగ్స్‌.. బెత్ మూనీ, నాట్ సీవర్‌ని వారించిన అదృష్టం!  


Also Read: WPL Auction 2023: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం.. స్మృతి మంధాన రేటు ఎంతో తెలుసా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.