Team India T20 Format Captaincy: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్లో ఓటమి తరువాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా ఘోరంగా విఫలమైన హిట్‌ మ్యాన్‌  కెప్టెన్‌గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా తుది జట్టులో వరుసగా విఫలమైనా అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులో కొనసాగించడం జట్టు వైఫల్యంపై ప్రభావం చూపించింది. ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని అభిమానులు జీర్ణించులేకపోతున్నారు.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే బీసీసీఐ ప్రక్షాళన మొదలు పెట్టాలని యోచిస్తోంది. 2024లో వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు కాగా.. వచ్చే వరల్డ్ కప్‌ నాటికి 37 ఏళ్లకు చేరుకుంటాడు. అప్పటికీ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుడ్‌ బై చెబితే తదుపరి కెప్టెన్ ఎవరు..? రేసులో ఎవరు ఉన్నారు..?


హార్దిక్ పాండ్యా 


టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌ రేసులో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ స్థానంలో భారత టీ20 జట్టుకు సారథ్యం వహించే శక్తి పాండ్యాకే ఉందని సీనియర్లు కూడా కొందరు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కూడా పాండ్యాను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భవిష్యత్‌లో కూడా అతనినే టీ20 టీమ్ కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది.


రిషబ్ పంత్ 


టీ20 కొత్త కెప్టెన్‌ రేసులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని ఎప్పటి నుంచి డిమాండ్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాకు కెప్టెన్‌గా.. ఓపెనర్‌గా జట్టును ముందుండి నడిపిస్తాడని అంటున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. రిషబ్ పంత్‌కు కూడా కెప్టెన్‌గా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 


సూర్యకుమార్ యాదవ్ 


టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ కూడా భవిష్యత్‌లో కెప్టెన్ రేసులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో నెంబర వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సూర్యకుమార్.. ఇటీవల వరల్డ్ కప్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. భవిష్యత్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సూర్యకుమార్ యాదవ్‌ను భవిష్యత్‌లో కెప్టెన్‌గానూ చూడొచ్చు. 


Also Read: Super Star Krishna: రాజకీయాల్లోనూ సూపర్ స్టార్.. ఎన్టీఆర్‌తో పోటాపోటీ.. ఆ ప్రకటన సంచలనం  


Also Read: Mahesh Babu: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి సోదరుడు మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook