Krishna Political Career: తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాల్లో ఎంత డేరింగ్‌గా దూసుకెళ్లారో.. రాజకీయాల్లోనూ ఆయన అంతే దూకుడు కనబర్చారు. పాలిటిక్స్‌లో ఉన్నది తక్కువ కాలమే ఆయన.. రాజకీయ ప్రస్థానం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఓసారి ఎంపీగా గెలిచి.. మరోసారి ఓటమి పాలయ్యారు.
ఎన్నో చిత్రాలతో దిగ్గజ నటుడు ఎన్టీఆర్‌ను ఢీకొట్టిన సూపర్ స్టార్ కృష్ణ.. రాజకీయంగానూ తగ్గేదేలే అన్నట్లు వ్యతిరేకంగా పనిచేశారు. ఎన్టీఆర్ కంటే ముందే ఆయనలో రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడు. ఏ హీరో కూడా స్పందించని సమయంలో 1972లో 'జైఆంధ్ర' ఉద్యమానికి సూపర్ స్టార్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అయితే 1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కృష్ణ ఈనాడు సినిమా తీశారు. ఈ సినిమా తెలుగుదేశం పార్టీ విజయానికి ప్లస్ అయిందని చెబుతారు.
అయితే ఆ తరువాత ఎన్టీఆర్‌తో కృష్ణకు దూరం పెరిగింది. 1984లో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. ఆయనను అభినందిస్తూ కృష్ణ ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదే ఏడాది ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువా కృష్ణ తీసిన కొన్ని సినిమాలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకమని ప్రచారం జరిగింది. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా 71వేల ఓట్ల మెజార్టీ విక్టరీ సాధించారు. అయితే రాజీవ్ గాంధీ హత్య అనంతరం 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యారు.
ఆ తరువాత ఆయన మెల్లగా రాజకీయాలకు దూరమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం మద్దతు తెలిపింది. అయితే కృష్ణ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయలేదు. రాజకీయాల్లో తనదైన ముద్రవేసి.. నటనలో ఎప్పటికీ స్టార్‌గా.. అభిమానుల గుండెల్లో ఎవర్ గ్రీన్‌గా.. టాలీవుడ్ చరిత్రలో సూపర్‌స్టార్‌గా కృష్ణ నిలిచిపోతారు.
Also Read: Mahesh Babu: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి సోదరుడు మృతి!
Also Read: Super Star Krishna: కృష్ణకు సూపర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook