Hardik Pandya Throw: లైవ్ మ్యాచ్ లో స్టంప్ ను విరగ్గొట్టిన హార్దిక్ పాండ్యా- మ్యాచ్ కు అంతరాయం!
Hardik Pandya Throw: ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విసిరిన `రాకెట్ త్రో`కు స్టంప్ విరిగిపోయింది. దీంతో మ్యాచ్ కు కొంత సమయం పాటు అంతరాయం కలిగింది.
Hardik Pandya Throw: ఐపీఎల్ లో గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో రాజస్థాన్ పై గుజరాత్ టీమ్ గెలుపొందింది. అయితే ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించాడు.
ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ను.. గుజరాత్ టైటాన్స్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ చేయడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న ఎనిమిదో ఓవర్లో.. హార్దిక్ పాండ్యా మెరుపువేగంతో త్రో విసిరాడు. ఆ 'రాకెట్ త్రో' కు సంజూ శాంసన్ రనౌట్ అవ్వడమే కాకుండా.. స్టంప్ కూడా విరిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
మ్యాచ్ కు అంతరాయం
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న ఎనిమిదో ఓవర్ లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ విసిరిన బంతిని మిడ్ - ఆఫ్ మీదుగా షాట్ ఆడిన శాంసన్.. హార్దిక్ చేతిలో రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో స్టంప్ విరిగిన కారణంగా మ్యాచ్ కు కొంత అంతరాయం కలిగింది. విరిగిన స్టంప్ స్థానంలో కొత్తదాన్ని తీసుకొచ్చేందుకు కొంత సమయం పట్టడం వల్ల అంతరాయం ఏర్పడింది.
హార్దిక్ పాండ్యా విధ్వంసం
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్‌తో విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో పాటు బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ కూడా తీశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook