ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. 2023 ప్రపంచకప్ ను భారత్ గెలిస్తే.. ఆ తర్వాత  రాహుల్ ద్రవిడ్‌ని ఈ పదవిలో కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ టీమిండియా టైటిల్ గెలవలేకపోతే ద్రవిడ్ పై ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. మన జట్టు సెమీఫైనల్ కు చేరుకున్న దానిని పెద్ద విజయంగా పరిగణించరు. అటువంటి పరిస్థితుల్లో బీసీసీఐ(BCCI) కొత్త కోచ్ కోసం అన్వేషించే అవకాశం ఉంది. ఒకవేళ ద్రవిడ్ కోచ్ పదవిలో కొనసాగడానికి ఇష్టపడితే.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ల వరకు కొనసాగించాలని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌లాగా తదుపరి ప్రపంచకప్ సైకిల్‌కు ముందు టెస్ట్, వన్జే ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను నియమించడం మంచిది. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ద్రవిడ్ కు ఉద్వాసన పలికితే.. అతడి స్థానంలో ఆశిష్ నెహ్రా మంచి ఆప్షన్. ఎందుకంటే ఐపీఎల్‌లో నెహ్రా చాలా విజయవంతమైన కోచ్. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ప్రధాన కోచ్ గా నెహ్రా ఉన్నాడు. అయితే నెహ్రా జాతీయ జట్టుకు కోచ్‌గా రావడానికి ఆసక్తి చూపడం లేదని అతడి సన్నిహతులు తెలిపారు. ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ అన్ని ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను కలిగి ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో..టెస్టు జట్టుకు కోచ్‌గా ఉండాల్సిందిగా ద్రావిడ్‌ను కోరాలని బీసీసీఐ మాజీ అధికారి ఒకరు తెలిపారు. రవిశాస్త్రి స్థానంలో ప్రధాన కోచ్‌గా నియమించబడిన రాహుల్ ద్రవిడ్.. వన్డేల్లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఈ తరుణంలో వివిధ ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేయాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉంది. 


2023 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


Also Read: World Cup 2023: వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. వెంటనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook