Chris Gayle sensational comments about IPL: ఐపీఎల్ 2022లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడని విషయం తెలిసిందే. కొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా మెగా టోర్నీకి దూరమయితే.. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మాత్రం తనకు సరైన గౌరవం దక్కలేదని తప్పుకున్నాడట. గేల్ ఐపీఎల్ 15వ సీజన్ కోసం వేలంలోనే పాల్గొనలేదు. అతడు ఎందుకు వేలంలో పాల్గొనలేదో అని అప్పుడు కారణం మాత్రం చెప్పలేదు. తాజాగా తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించి.. ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ జాతీయ మీడియాతో క్రిస్ గేల్ మాట్లాడుతూ... 'గత కొన్నేళ్లలో ఐపీఎల్ టోర్నీలో నాకు సరైన గౌరవం దక్కలేదనిపించింది. ఐపీఎల్‌లో  ఎన్నో రికార్డులు అందుకున్న తర్వాత కూడా.. కనీస గౌరవం దక్కలేదని భావించాను. ఇన్నేళ్లుగా ఇంత చేశాక అలా జరగడంతో ఐపీఎల్ 2022 వేలంలో ఉండకూడదనుకున్నా. అందుకే నా పేరు నమోదు చేసుకోలేదు. క్రికెట్‌ కాకుండా ఇంకా చాలా జీవితం ఉంది. దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నా' అని తెలిపాడు. 


'ఐపీఎల్ టోర్నీలో పలు జట్లకు ఆడాను. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నా ప్రయాణం గొప్పగా సాగింది. బెంగళూరు  తరఫున అద్భుతంగా రాణించాను. వచ్చే ఏడాది మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగుతాను. బెంగళూరు లేదా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఏదైనా ఒక టీమ్ తరఫున ఆడి టైటిల్ అందించాలనుంది' అని క్రిస్ గేల్ తెలిపాడు. గేల్ ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.


ఐపీఎల్‌ టోర్నీలో 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 148.96 స్ట్రైక్ రేట్‌తో 4965 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే 18 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2013 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గేల్.. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. పుణెపై ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఎవరూ అందుకోలేరేమో. ఐపీఎల్లో 357 సిక్స్‌లు బాదిన గేల్.. ఈ ఘనత అందుకున్న ఏకైక బ్యాటర్‌గా కూడా రికార్డుల్లో ఉన్నాడు.


Also Read: Happy Mothers Day 2022: నేడు మదర్స్ డే... మాతృమూర్తులకు 'గూగుల్ డూడుల్' స్పెషల్ విషెస్...


Also Read: Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook