Shardul Thakur: ఆ సత్తా ఉందని తెలుసు: శార్దూల్ ఠాకూర్
తనలో ఆల్ రౌండ్ నైపుణ్యం ఉందని, బ్యాట్‌తోనూ సత్తాగలనన్న నమ్మకం తనకు ఉందన్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. తాజాగా లంకతో జరిగిన టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
శ్రీలంకతో జరిగిన మూడు ట్వంటీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium)లో జరిగిన మూడో టీ20లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టీమిండియా పేసర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హీరో శార్దూల్ ఠాకూర్ అటు బంతితో, ఇటు బాల్‌తోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తనకు మెరుగ్గా బ్యాటింగ్ చేసే సత్తా ఉందని శార్దూల్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో రాణించగలనన్న నమ్మకం ఉంది. ఇటీవల బ్యాటింగ్‌పై కూడా ఫోకస్ చేస్తున్నాను. బ్యాట్‌తో రాణించగల సత్తా ఉందని నాకు తెలుసు. ముఖ్యంగా 8వ స్థానంలో దిగే ఆటగాడు చేసే పరుగులు జట్టుకు కీలకం. డగౌట్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ పరిస్థితిని అంచనావేస్తాను.
Also Read: శ్రీలంకపై ఘన విజయం.. సిరీస్ భారత్ కైవసం
క్రీజులోకి వచ్చాక కాసేపు ఒత్తిడికి గురవుతా. తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు యత్నిస్తాను. లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడంతో పాటు బంతిని స్వింగ్ చేయడానికి ఇష్టపడతాను. స్వింగ్ చేస్తే వికెట్లు తీయడం తేలిక అవుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు, మేనేజ్‌మెంట్ సహకరిస్తున్నారని’ శార్దూల్ వివరించాడు.
పూణే వేదికగా జరిగిన నిర్ణయాత్మక టీ20లో 8 బంతులాడిన శార్దూల్ 22పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టి 19 పరుగులు ఇచ్చాడు. కాగా, టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన లంక 15.5 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..