టీమిండియా నిషేధిత పేసర్ శ్రీశాంత్ - 'నాపై నిషేధం ఎత్తెయ్యకపోతే వేరే దేశం వెళ్లి ఆడుకుంటా..' అని బీసీసీఐపై ఎదురుదాడికి దిగాడు. ఇటీవల కేరళ హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఆయన ఒక వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో "నాపై క్రికెట్ ఆడకూడదని నిషేధం ఉంది. నిషేధం ఎత్తెయ్యకపోతే నేను మరో దేశానికి వెళ్లి ఆడుకుంటా. నా వయసు 34. మహా అయితే ఆరేళ్ళు ఆడుతా. క్రికెట్ అంటే నాకు ఇష్టం. ఎలాగైనా ఆడాలన్నది నా కోరిక. బీసీసీఐ ఒక ప్రవేట్ సంస్థ మాత్రమే" అని  పేర్కొన్నాడు. 2013లో జరిగిన ఐపీయల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ జీవితకాలం నిషేధం ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడికి వెళ్లి ఆడలేడు: బీసీసీఐ 


శ్రీశాంత్ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు లేదా బోర్డులు ఒక ఆటగాడిపై జీవితకాలం పాటు నిషేధం ప్రకటిస్తే .. అతడు శాశ్వత సభ్యత్వ దేశంలోనూ లేదా బోర్డు లోనూ ఆడటానికి వీలులేదు. కాబట్టి దీనిపై చర్చ అవసరం అని అంది.