Qinwen Zheng: ఫ్రెంచ్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపై చైనా ప్లేయర్ హార్ట్ టచింగ్ కామెంట్స్...
Qinwen Zheng Heart Touching Words: ఒకవేళ కడుపు నొప్పి లేకపోయి ఉంటే టెన్నిస్ కోర్టులో తాను మరింత చురుగ్గా కదిలి ఉండేదాన్ని అని.. తనకెదురైన పరిస్థితికి తనపై తనకే జాలి కలుగుతోందని వాపోయింది.
Qinwen Zheng Heart Touching Words: ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ-క్వార్టర్స్‌లో ఓటమి తర్వాత చైనా క్రీడాకారిణి కిన్వెన్ జెంగ్ చేసిన వ్యాఖ్యలు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. మ్యాచ్ తొలి సెట్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న దశలో హఠాత్తుగా కడుపులో నొప్పి రావడం కిన్వెన్ గేమ్‌ను తలకిందులు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు కోల్పోయి ప్రపంచ నెంబర్.1 క్రీడాకారిణి ఇగ స్వియాటెక్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్‌లో ఓటమిపై కిన్వెన్ చేసిన వ్యాఖ్యలు హృదయాలను తాకేలా ఉన్నాయి.
మ్యాచ్ అనంతరం కిన్వెన్ జెంగ్ మాట్లాడుతూ... తన ఓటమికి నెలసరి కారణమని పేర్కొంది. 'సహజంగా ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యలే..' అంటూ పరోక్షంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. మొదటి రోజు తనకు భరించలేనంత నొప్పి ఉంటుందని... ఒక స్త్రీగా తన స్వభావానికి విరుద్ధంగా వెళ్లడం సాధ్యపడదని పేర్కొంది. అందుకే టెన్నిస్ కోర్టులో తానొక అబ్బాయిలా ఉండాలని కోరుకుంటానని... అలా అయితే ఇలాంటి సమస్యలేమీ ఉండవని అభిప్రాయపడింది.
ఒకవేళ కడుపు నొప్పి లేకపోయి ఉంటే టెన్నిస్ కోర్టులో తాను మరింత చురుగ్గా కదిలి ఉండేదాన్ని అని.. తనకెదురైన పరిస్థితికి తనపై తనకే జాలి కలుగుతోందని వాపోయింది. మరోసారి స్వియాటెక్‌తో తలపడాలని కోరుకుంటున్నానని... అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొద్దని ఆశిస్తున్నానని తెలిపింది.
ప్రపంచ నెంబర్ 74 క్రీడాకారిణి అయిన కిన్వెన్ జెంగ్ ప్రపంచ నెంబర్.1 క్రీడాకారిణి ఇగ స్వియాటెక్ చేతిలో 6-7 (5/7), 6-0, 6-2 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ సెకండ్ సెట్ సందర్భంగా కిన్వెన్ మెడికల్ టైమ్ అవుట్ తీసుకుంది. కాలి గాయం కారణమని చెప్పినప్పటికీ... నెలసరే అసలు కారణమని మ్యాచ్ అనంతరం వెల్లడించింది. భరించలేని కడుపునొప్పితో బాధపడుతూ కూడా మ్యాచ్ ఆడినప్పటికీ... అనుకున్న స్థాయిలో రాణించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో స్వియా టెక్ వరుసగా 32 మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్లయింది.
Also Read: Importance Of Gooseberry: ఉసిరికాయలో ఔషధ గుణాలు..'అమృతం పండు' సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!!
Also Read: Tirupati Railway Station: ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తిరుపతి, డిజైన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook