ICC announces schedule for T20 World Cup 2022: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆస్ట్రేలియా (Australia) అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌ జరగనుండగా.. నవంబర్‌ 10న రెండో సెమీస్‌ జరుగుతుంది. ఇక మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ (T20 World Cup 2022 Final) మ్యాచ్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2022 (ICC Men's T20 World Cup 2022 Schedule) సూపర్-12 స్టేజీలో జట్లను ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్‌, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇక క్వాలిఫయర్ మ్యాచ్‌లలో శ్రీలంక, నమీబియా, వెస్టిండీస్, స్కాట్లాండ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులోని నాలుగు జట్లు సూపర్-12లో ప్రవేశించనున్నాయి.


Also Read: IND vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్! సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్!!



మ‌రోసారి దాయాదుల పోరుకు (India vs Pakistan) టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ వేదిక కానుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దాయాది జట్టు పాకిస్థాన్‌తో భారత్ తొలి పోరులో తలపడనుంది. టీ20 ప్ర‌పంచక‌ప్ 2021 లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో భారత్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి ఎరగని భారత్.. అప్పటి తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం పాలైంది. ఈ సారైనా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. 



మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 సహా అన్ని ఫార్మాట్‌ల సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికేశాడు. నూతన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని భారత్ ఈసారి బరిలోకి దిగబోతోంది. అలానే కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) మార్గదర్శకంలో తొలిసారి భారత్‌ ఐసీసీ ట్రోఫీలో ఆడనుంది. కాబట్టి ఇది రోహిత్‌తో పాటు ద్రవిడ్‌కు అగ్నిపరీక్షే. 


Also Read: TV Debate Woman Dance: టీవీ డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. ఓ మహిళ అందరి ముందే.. (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook