Wasim Khan ICC: ఐసీసీ జనరల్ మేనేజర్‌గా మాజీ క్రికెటర్ వసీం ఖాన్!
ICC appoint Wasim Khan as General Manager. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన జనరల్ మేనేజర్‌గా మాజీ క్రికెటర్ వసీం ఖాన్ ఎంపికయ్యా డు.
ICC appoint Former Pakistan Player Wasim Khan as General Manager of Cricket: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన జనరల్ మేనేజర్‌గా మాజీ క్రికెటర్ వసీం ఖాన్ ఎంపికయ్యా డు. ప్రస్తుతమున్న జెఫ్ అలర్డైస్ నుంచి వచ్చే నెలలో వసీం భాద్యతలు తీసుకోనున్నాడు. వసీం ఖాన్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. మూడు సంవత్సరాల పదవీకాలంలో.. మరో నాలుగు నెలలు ఉండగానే ఆయన ఆ పదవి నుంచి పక్కకు తప్పుకున్నాడు.
పాకిస్తానీ మూలాలు ఉన్న తొలి బ్రిటిష్ ప్రొఫెషనల్ క్రికెటర్ వసీం గుల్జర్ ఖాన్. ఈయన 1971 ఫిబ్రవరి 26న బర్మింగ్‌హోంలో జన్మించాడు. వసీం ఖాన్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్‌తో పాటు రైట్ ఆర్మ్ బౌలర్ కూడా. ఆయన కుటుంబం 1960లో ఇంగ్లండ్‌కు తరలివెళ్లింది. వసీం టాలెంట్‌ను 12వ ఏట తన టీచర్ గుర్తించి.. ప్రోత్సాహించారు. ఆతర్వాత 1983లో వార్‌విక్‌షైర్ అండర్ థర్టీన్ టీంకు ఎంపికయ్యాడు. ఫస్ట్ క్లాస్ కేరీర్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడగా.. 30.15 యావరేజ్‌తో 2835 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కేరీర్‌లో వసీం ఖాన్ బెస్ట్ స్కోర్ 181 పరుగులు.
వసీం ఖాన్ అక్టోబర్ 2014లో లీసెస్టర్ షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవోగా నియమితుడయ్యాడు. అయితే రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. వసీం ఖాన్ 2021లో సీఈవోగా పక్కకు తప్పుకున్నాడు. ఐసీసీ టీంలో జాయిన్ కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు వసింఖాన్ తెలిపారు. క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. అటు వసీం రాకను స్వాగతిస్తున్నట్టు ప్రస్తుత జీఎం జెఫ్ అలర్డైస్ చెప్పారు.
Also Read: Ketika Sharma: టవల్ అడ్డుపెట్టి అందాలను దాచేసిన కేతిక శర్మ.. హాట్ సెల్ఫీ చుస్తే అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.