Ind vs Pak 2023:  ప్రపంచకప్ క్రికెట్‌లో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా సమరం ఇవాళ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది.  రెండు జట్లు హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమౌతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయంతో ఇండియా, శ్రీలంకపై  రికార్డు స్థాయిలో లక్ష్య ఛేదన చేసి పాకిస్తాన్ మంచి ఊపుతో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డే ప్రపంచకప్‌లో అందరూ ఆతృతతో ఎదురు చూసే మ్యాచ్ మద్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ స్డేడియంలో జరగనుంది. వర్షం ప్రభావం కాస్త ఉండే అవకాశముందని తెలుస్తోంది. అయితే తేలికపాటి వర్షం కావడంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాల్లేవు. ఇక పిచ్ పేసర్లు, బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. గత రెండేళ్లలో ఈ పిచ్‌పై జరిగిన 4 మ్యాచ్‌లలో 59.89 శాతం వికెట్లను పడగొట్టింది పేసర్లే. ఈ మ్యాచ్‌లో విజయం రెండు రానున్న మ్యచ్‌లకు కావల్సిన ఉత్సాహాన్ని, ఎనర్జీని అందిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. 


వన్డే ప్రపంచకప్ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకూ ఇండియాదే ఆధిక్యంగా కన్పిస్తోంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మద్య ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు జరిగితే అన్నింట్లో టీమ్ ఇండియాదే విజయం. 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించడంతో రెండు జట్లు తలపడలేదు. 


వన్డే ప్రపంచకప్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ల వివరాలు


1992 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా టీమ్ ఇండియా పాకిస్తాన్ జట్టుపై 43 పరుగుల తేడాతో విజయం
1996 ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా ఇండియా 39 పరుగులే తేడాతో విజయం
1999 ప్రపంచకప్‌లో మాంచెస్టర్ వేదికగా టీమ్ ఇండియా..పాకిస్తాన్ జట్టుపై 47 పరుగుల తేడాతో గెలిచింది
2003 ప్రపంచకప్‌లో సెంచూరియన్ వేదికగా ఇండియా.. పాకిస్తాన్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపు
2011 ప్రపంచకప్‌లో మొహాలీ వేదికగా ఇండియా..పాకిస్తాన్ జట్టుపై 29 పరుగులతో గెలిచింది.
2015 ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా..పాకిస్తాన్ జట్టుపై 76 పరుగుల ఆదిక్యంతో గెలుపు
2019 పపంచకప్‌లో మాంచెస్టర్ వేదికగా టీమ్ ఇండియా..పాకిస్తాన్ జట్టుపై 89 పరుగుల తేడాతో విజయం


Also read: Ind vs Pak Match: ఇండియా పాక్ హై వోల్టేజ్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉంటుందా లేదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook