Ind vs Pak Match: సీసీ వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్ధి దేశాలు ఇవాళ తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సజావుగా జరగనుందా లేదా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా వర్షసూచన ఉంది. ఈ వర్షం మ్యాచ్‌పై ఏ మేరకు ప్రభావం చూపించనుందో పరిశీలిద్దాం.
వన్డే ప్రపంచకప్‌లో రెండు దాయాది దేశాలు ఇవాళ అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్డేడియంలో ఇవాళ జరగనున్న మ్యాచ్ రెండు దేశాలకు హ్యాట్రిక్ అవకాశాన్ని ఇస్తోంది. ఈ రెండు దేశాలు రెండేసి మ్యాచ్‌లు గెలిచి మూడవ విజయం కోసం చూస్తున్నాయి. ప్రపంచకప్ 2023లో ఇదొక హై వోల్టేజ్ మ్యాచ్. మ్యాచ్ చూసేందుకు కచ్చితంగా స్డేడియం నిండిపోనుంది. ఇంతటి హై వోల్టేజ్ మ్యాచ్ పై వర్షం ప్రభావం ఉంటుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. వర్షం పడితే ఆడగాళ్లతో పాటు అబిమానుల్లో కూడా తీవ్ర నిరాశ నెలకొంటుంది. అందుకే అసలు అహ్మదాబాద్ వాతావరణం ఇవాళ ఎలా ఉందో చూద్దాం.
అహ్మదాబాద్ లో రానున్న 5 రోజులు వాతావరణం పొడిగానే ఉంటుందని అదే సమయంలో తేలికపాటి వర్షం పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండవచ్చని అంచనా. కొన్ని ప్రాంతాల్లో అయితే రేపు, ఎల్లుండ వర్షాలు పడవచ్చు. ఇంకొంతమంది వాతావరణ పరిశధకులైతే ఇవాళ వర్షం కురిసే అవకాశాల్లేవని, మేఘాలు మాత్రం ఉంటాయంటున్నారు. రాష్ట్రంలో గరిష్టంగా 35-37 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావచ్చని సమాచారం. అదే సమయంలో తేలికపాటి వర్షం ఉండవచ్చంటున్నారు. అక్టోబర్ 14 నుంచి 17 వరకూ అకాల వర్షసూచనైతే ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్, ఆనంద్, మహి సాగర్, ఆరావళి, బనస్కాంత ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
ఇవాళ జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ వర్షం పడే అవకాశాలు లేవని కానీ తేలికపాటి వర్షం పడవచ్చని దాదాపు అన్ని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తేలికపాటి వర్షం ఏ మేరకు ఉంటుంది, పిచ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇంకా తెలియతదు.
టీమ్ ఇండియా అంచనా జట్టు
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదగవ్, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్
పాకిస్తాన్ అంచనా జట్టు
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహిద్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్
Also read: 2028 Los Angeles Olympics: గుడ్ న్యూస్ .. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook