ICC Player of the Month: శుభ్‌మన్ గిల్ కు శుభవార్త.. ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. ఈ ఏడాదిలో రెండోసారి!
అటు ఆసియా కప్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఐసీసీ ప్రకటించింది.
ICC Player of the Month: సెప్టెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరో ICC ప్రకటన చేసింది. భారత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ ICC మేన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్.. అలాగే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేసినందుకు గిల్‌కు ఈ అవార్డు లభించింది. గిల్ ఈ సంవత్సరంలో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదివరకు జనవరిలో శుభ్‌మాన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆసియా కప్‌లో సహా 75.5 సగటుతో 302 పరుగులు చేశాడు. ఆసియా కప్ భారత్ మరియు శ్రీలంకతో మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 27 నాటౌట్‌తో నిలవగా.. భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తరువాత తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గిల్ మరోసారి తన సత్తా చాటాడు. మొహాలీలో 74 పరుగులు, ఇండోర్‌లో 104 పరుగులు చేసి.. టీమియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ.. "సెప్టెంబర్ నెల ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం.. జట్టుకు అండగా నిలవడం గొప్ప విశేషం. ఈ అవార్డు నా ఫామ్ ను కొనసాగించటానికి మరియు దేశం గర్వించేలా ఆడటంలో స్ఫూర్తినిస్తుంది' అని తెలిపారు.
ఆసియా కప్ 2023 గెలవటంలో మరియు ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ గెలవటంలో నా వంతు పాత్రను నేను పూర్తీ చేశాననే అనుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని పొందిన సందర్భంగా కుటుంబ సభ్యలకు, నా సహాచరులకు కోచ్‌లందరికీ కృతజ్ఞతలు.. వారి సహాయం లేకుండా ఈ విజయం సాధ్యపడేది కాదని" పేర్కొన్నారు.
ఇక ప్రపంచకప్ 2023 విషయానికి వస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో శుభమన్ గిల్ ఆడలేదు. డెంగ్యూ భారిన పడిన కారణంగా ఈ రెండు మ్యాచ్ లకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న శుభమన్ గిల్ అక్టోబర్ 14 వ తేదీన పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండదో లేదో అన్న విషయం ఇప్పటికీ తెలియలేదు.
జనవరి- శుభమన్ గిల్
ఫిబ్రవరి- హ్యారీ బ్రూక్
మార్చి- షకీబ్ అల్ హసన్
ఏప్రిల్ - ఫఖర్ జమాన్
మే- హ్యారీ టెక్టర్
జూన్- వనిందు హజరంగా
జూలై- క్రిస్ వోక్స్
ఆగస్టు- బాబర్ ఆజం
సెప్టెంబర్- శుభమన్ గిల్
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం