Babar Azam surpasses Virat Kohli's Record: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజ‌మ్ అగ్రస్థానంలో నిలిచాడు. 818 రేటింగ్ పాయింట్లతో బాబర్ టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో టాప్ ఫామ్‌లో ఉన్న పాక్ ఓపెనింగ్ బ్యాటర్ టీ20 ర్యాంకుల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నాడు. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగిన బ్యాటర్‌గా బాబర్ ఆజ‌మ్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న బాబర్.. 1000 రోజుల కంటే ఎక్కువ కాలం తన ర్యాంక్ కాపాడుకున్నాడు. ఇదివరకు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 1013 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. తాజాగా అతని రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కూడా లేకపోవడం విశేషం. 


విరాట్ కోహ్లీ ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల విరాట్ అన్ని ఫార్మాట్లలో భారీ స్కోర్లు చేయలేకపోతున్న విషయం తెలిసిందే. గత 3 ఏళ్లుగా టీ20 ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 300 పరుగులకు మించి చేయలేకపోయాడు. అదే సమయంలో ఏ ఫార్మాట్లో కూడా ఒక్క శతకం బాదలేకపోయాడు. దాంతో విరాట్ ర్యాంకింగ్స్‌ రోజురోజుకు పడిపోతూ వస్తున్నాయి. మరోవైపు టాప్ ఫామ్‌లో బాబర్ ఆజ‌మ్ రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్నాడు. 



ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల హవా నడుస్తోంది. బాబర్ ఆజ‌మ్ అగ్రస్థానంలో ఉంటే.. మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ రెండ‌వ స్థానంలో ఉన్నాడు. మార్కరం, మలన్, ఫించ్ టాప్ 5లో ఉన్నారు. టాప్ 10 జాబితాలో యువ ప్లేయర్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే భారత్ నుంచి ఉన్నాడు. ఇషాన్ 682 రేటింగ్ పాయింట్లతో ఏడ‌వ ర్యాంక్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ పరుగుల వరద పారించిన విష‌యం తెలిసిందే.


Also Read: Flipkart Offers: రూ.60 వేల LG 43 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.21 వేలకే.. ఆఫర్ మూడు రోజులు మాత్రమే!


Also Read: Flipkart Best Offers: నేటి నుంచే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 అమ్మకాలు.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.999కే 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.