ICC T20 Rankings: అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సూర్య.. రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్..
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ కొత్త జాబితా విడుదలైంది. ఎప్పటిలానే సూర్య తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రెండో స్థానానికి మాత్రం ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ దూసుకొచ్చారు. అతడు ఎవరంటే?
ICC Men's Player Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లిస్ట్ విడుదలైంది. మరోసారి టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం సూర్య పాయింట్లు 887. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అనుహ్యంగా రెండో స్థానానికి దూసుకొచ్చాడు. అంతకు ముందు 90 స్థానంలో ఉన్న ఫిల్.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో దుమ్మురేపాడు.ఈ సిరీస్‌లో 2 భారీ సెంచరీలతోపాటు మొత్తం 331 పరుగులు చేయడంతో సాల్ట్ 88 స్థానాలు ఎగబాకి సెకండ్ ప్లేస్ కు వచ్చాడు. ప్రస్తుతం ఇతడు 802 పాయింట్లతో ఉన్నాడు. అయితే సాల్ట్ ఈ సారి జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (787 పాయింట్ల) మూడో స్థానంలో నిలిచాడు
ఇక టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆప్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడో స్థానానికి ఎగబాకాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాత మూడు ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ గిల్ రండో స్థానంలోనూ, విరాట్ కోహ్లీ మూడో స్థానంలోనూ, రోహిత్ శర్మ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
Also Read: Shocking Incident: భారత గ్రాండ్‌మాస్టర్ల ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్‌లు ఎత్తుకెళ్లిన దొంగలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook