ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. అలాంటి చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూప్‌లో.. అంటే గ్రూప్-2లో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC rankings) ఆధారంగా వరల్డ్ కప్ గ్రూపుల వారీగా ఆయా దేశాల జట్లను డివైడ్ చేశారు. ర్యాంకుల్లో టాప్-8 లో ఉన్న దేశాల జట్లు నేరుగా రెండో రౌండ్‌లో పోటీ పడనుండటంతో ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో చేర్చుతూ ఐసీసీ గ్రూపుల జాబితా విడుదల చేసింది. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లో ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లను, క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పోటీపడిన అనంతరం ఈ జట్లకు రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత లభిస్తుంది. అలా గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 కు చేరతాయి. 


Also read : Covid-19: రిషబ్ పంత్‌కు అండగా నిలిచిన బీసీసీఐ అధ్యక్షుడు Sourav Ganguly


తొలి రౌండ్:
గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా (Sri Lanka, Ireland, Netherlands and Namibia).
గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ (Bangladesh, PNG, Scotland and Oman). 


సెకండ్ రౌండ్ (సూపర్-12):
గ్రూప్-1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో పాటు (West Indies, England, Australia and South Africa) గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్ జట్లు ఉంటాయి. 
గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.


Also read : COVID-19: రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్, Delta Variantను గుర్తించిన వైద్యులు


అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌లో బీసీసీఐ నిర్వహించాల్సిన ఈ టోర్నమెంట్ దేశంలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తి కారణంగా యూఏఇలో నిర్వహించనున్నట్టు ఇటీవలే బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ (BCCI chief Sourav Ganguly) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.


Also read : T20 World Cup 2021: Shikhar Dhawan కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ఛాన్స్ : Ajit Agarkar


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook