T20 World Cup 2024 Ind vs Eng: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో రెండవ సెమీఫైనల్ ఇవాళ గయానా పిచ్‌పై ఇండియా -ఇంగ్లండ్ల జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్ 1లో ఆప్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికాలు తలపడుతుంటే రెండవ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్-ఇండియాలు పోటీపడనున్నాయి. ఇవాళ్టి ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అడ్డంకిగా మారనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్, రికార్డ్


గయానాలోని ప్రోవిడెన్స్ స్డేడియం ఇప్పటి వరకూ స్పిన్‌కే అనుకూలంగా ఉంది. ఈ పిచ్ పై 34 టీ20లు జరిగితే 16 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. 14 సార్లు ఛేజింగ్ టీమ్ నెగ్గింది. టీ20 ప్రపంచకప్‌లో ఇండియా ఇంగ్లండ్ దేశాలు 4 సార్లు తలపడగా చెరో రెండుసార్లు గెలిచాయి. 2007 ప్రపంచకప్‌లో ఇండియా విజయం సాధిస్తే 2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ గెలిచింది. 2012లో ఇండియా గెలిస్తే 2022లో ఇంగ్లండ్ గెలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మద్య 23 టీ 20లు జిరిగే ఇండియా 12, ఇంగ్లండ్ 11 సార్లు గెలిచాయి. గణాంకాల ప్రకారం రెండు జట్లు పటిష్టంగానే ఉన్నాయి.


గయానా పిచ్‌పై ఇండియా మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు అడగా రెండు గెలిచింది. ఇంగ్లండ్ ఈ పిచ్‌పై రెండు మ్యాచ్‌లే ఆడింది. ఒకటి వర్షంతో రద్దయితే మరొకటి డక్‌వర్త్ లూయిస్ కారణంగా ఓడింది. 


వర్షం పడితే ఎవరికి అనుకూలం


భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించగా ఇండియా ఇంగ్లండ్ రెండవ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. కానీ ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్‌కు అదనంగా 250 నిమిషాల సమయం ఉంది. ఎందుకంటే రెండవ సెమీఫైనల్‌కు ఫైనల్ మ్యాచ్‌కు మధ్య కేవలం ఒక రోజే వ్యవధి మిగిలుంది. రెండవ సెమీఫైనల్ పగటి మ్యాచ్ కావడంతో అదనం 250 నిమిషాల సమయం కేటాయించారు. అంటే వర్షం కారణంగా ఆలస్యమైతే రాత్రి వరకూ కొనసాగనుంది.


గయానాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షపాతం నమెదవుతోంది. ఇవాళ కూడా 90 శాతం వర్షం పడేందుకు అవకాశాలున్నాయి. రిజర్వ్ డే లేకపోవడంతో అదనంగా కేటాయించిన 250 నిమిషాల వరకూ మ్యాచ్ జరిపేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ వర్షం తగ్గకుంటే మ్యాచ్ రద్దవుతుంది. గ్రూపులో ఇండియా అగ్రస్థానంలో ఉండటంతో ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అంటే మ్యాచ్ జరగకపోతే ఇండియాకే లాభమౌతుంది. అందుకే ఇవాళ్టి మ్యాచ్‌లో వరుణుడే కీలకంగా మారాడు. 


Also read: VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్..! బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్న వీవీఎస్ లక్ష్మణ్..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook