T20 World Cup 2024 Ind vs Pak: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌలర్లు అద్భుతంగా రాణించినా బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో పాకిస్తాన్ చేతులెత్తేసింది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో దాయాది దేశంపై విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూయార్క్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీమ్ ఇండియాను 19 ఓవర్లకే కేవలం 119 పరుగులకు ఆలవుట్ చేసింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ బౌలర్లకు అద్భుతంగా అనుకూలించింది. పాకిస్తాన్ బౌలర్లు వసీం షా, హరీస్ రౌఫ్, మొహమ్మద్ ఆమిర్‌లు అద్భుతంగా రాణించడంతో టీమ్ ఇండియా 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 119 పరుగులకే చాప చుట్టేసింది. టీమ్ ఇండియా తరపున రిషభ్ పంత్ ఒక్కడే 42 పరుగులు చేశాడు. రోహత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సుర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా అంతా విఫలమయ్యారు. 


119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పాకిస్తాన్‌ను టీమ్ ఇండయా బౌలర్లు అద్బుతంగా కట్టడి చేశారు. జస్ప్రీత్ బూమ్రా అద్భుత స్పెల్ ముందు పాక్ బ్యాటర్లు విఫలమయ్యారు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా  కూడా 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్ వికెట్ పడగొట్టకపోయినా అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చాడు. పాకిస్తాన్ చివరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి ఉండగా అర్షదీప్ సింగ్ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. దాంతో 7 పరుగుల తేడాతో విజయం టీమ్ ఇండియా వశమైంది. 


టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా రికార్డు 7-1కు చేరింది. చాలా సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి సూపర్ 8 అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ బ్యాటర్లలో మొహమ్మద్ రిజ్వాన్ తప్పించి మరెవరూ రాణించలేకపోయారు. 


Also read: IND vs PAK Dream11 Team Tips: పాక్‌తో సమరానికి భారత్ సై.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook