India vs Pakistan Head to Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో నేడు అసలు సమరం జరగనుంది. చిరకాల ప్రత్యుర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఓడించాలని రంగంలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి భారత్ జోరు మీద ఉండగా.. యూఎస్‌ఏ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన పాక్ డీలాలో పడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడితే సూపర్-8 అవకాశాలు కూడా సంక్లిష్టమవనున్న తరుణంలో గెలుపు కోసం పాక్ సర్వశక్తులు ఒడ్డనుంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాను ఓడించడం పాక్‌కు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: కిషన్ రెడ్డికి బంపర్ ఆఫర్..? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ సికిందర్..?
టీ20ల్లో హెడ్ టు హడ్ రికార్డుల విషయానికి వస్తే.. భారత్-పాకిస్థాన్ మధ్య 12 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా తొమ్మిదింటిలో విజయం సాధించింది. పాక్ కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ 6-1 ఆధిక్యంలో ఉంది. రికార్డులు భారత్‌కు అనుకూలంగా ఉన్నా.. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. విరాట్ కోహ్లీ (488 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉండగా.. హార్దిక్ పాండ్యా (11 వికెట్లు) పాక్‌పై భారత్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు.
నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రోహిత్ శర్మ మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. పిచ్‌పై సీమ్, బౌన్స్ ఉండడంతో బౌలర్లతోపాటు బ్యాట్స్‌మెన్‌కు కూడా మంచి సహకారం లభిస్తుంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ ఛేజింగ్ జట్ల విజయశాతం ఎక్కువగా ఉంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 62 శాతం విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్/సాయిమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ ఆమిర్, హరీస్ రవూఫ్
Ind Vs Pak Dream11 Team Prediction
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్
బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ, బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫకర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, ఇమాద్ వాసిమ్, రవీంద్ర జడేజా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ ఆమిర్ (వైస్ కెప్టెన్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter