ICC T20 World Cup: భారత్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటగా ఐపీఎల్ 2021 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఇటీవల స్పష్టం చేయడం తెలిసిందే. తాజాగా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న దేశ వ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు రాగా, నేడు ఏకంగా 1 లక్షా 26వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు అక్టోబర్‌లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా ప్రభావాన్ని అధికంగా చవిచూస్తున్న దేశం భారత్ కనుక టీ20 ప్రపంచ కప్(T20 World Cup) వేదిక మారనుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ గవర్నింగ్ బాడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అల్లార్‌డైస్ దీనిపై స్పందించారు. మరో 6 నెలల సమయం ఉందని, ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 


బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి దేశంలో జరగనున్న ప్రధాన ఈవెంట్ల గురించి ఐసీసీ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ప్రత్యామ్నాయ వేదిక గురించి ఐసీసీ ఇప్పటివరకూ యోచించలేదని తెలిపారు. సరైన సమయంలో మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. 8 జట్లు పాల్గొననున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) ఏప్రిల్ 9నుంచి బయో బబుల్ వాతావరణంలో ప్రారంభం కానుంది. 


Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 2 వేలు పైగా పాజిటివ్ కేసులు


ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే నిర్ణయానికి ఐసీసీ మద్దతు తెలిపిందని జెఫ్ అల్లార్‌డైస్ గుర్తుచేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తక్కువ సమయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదిక గురించి చర్చ జరగలేదన్నారు. బయోబబుల్ వాతావరణంలో ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై సైతం ఐసీసీ పరిశీలిస్తుందని వివరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook