డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌కు మూడు రోజుల ముందు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి నెగెటివ్‌గా తేలింది. ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టులలో వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేతో పాటు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముంబై శిబిరంలో సంతోషం నెలకొంది. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంసిద్ధమైంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో మూడుసార్లు ఐపీఎల్ ఫైనలిస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కిరణ్ మోరే చెన్నైలో అదే హోటల్లో ఉంటున్నాడు. ఆయనకు, ముంబై ఇండియన్స్ సహాయక సిబ్బందికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. హోం క్వారంటైన్లో ప్రత్యేకించిన గదులలో ఉంచి చికిత్స అందించారు. ఐపీఎల్ 2021 నిర్వహణలో భాగంగా వారికి తాజాగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలలో అందరికీ నెగెటివ్‌గా నిర్థారణ అయింది. బీసీసీఐ ప్రొటోకాల్స్ పాటించాం, ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నామని ముంబై ఇండియన్స్(Mumbai Indians) ట్వీట్ చేసింది.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ 2021కు దూరమైనా పూర్తి వేతనం అందుకోనున్న శ్రేయస్ అయ్యర్
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ప్రస్తుతం బయోబబుల్ వాతావరణంలో ప్రాక్టిస్ చేస్తున్నారు. హోటల్ తదితర సౌకర్యాలను బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కట్టుదిట్టం చేసింది. ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేతో పాటు జట్టు సహాయక సిబ్బందికి సైతం కోవిడ్19 నెగటివ్‌గా తేలడంతో ఫ్రాంచైజీ ఊపిరి పీల్చుకుంది. వాంఖేడే స్టేడియంలో ఐపీఎల్ 2021(IPL 2021) మైదాన సిబ్బందికి సైతం కరోనా సోకింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు, స్థిరంగా వెండి ధర
సోమవారం నాడు మరో ఇద్దరు మైదాన సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. దాంతో మొత్తం 10 మంది వాంఖేడే మైదాన సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయితే ఐపీఎల్ నిర్వహణకు ఏ ఆటంకం తలెత్తకూడదని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి భావిస్తోంది. ముంబై స్టేడియంలో శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ముంబైలో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook