T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాల మద్య ఆసక్తికర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉన్న అంచనాల నేపధ్యంలో ఏ దేశం ఎన్నిసార్లు గెలిచిందో తెలుసుకుందాం. రెండు దేశాల మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ ఏమంటున్నాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICC T20 World Cup 2021లో India vs Pakistan మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘకాలం తరువాత రెండు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అసలు ఇండియా పాకిస్తాన్‌లలో ఏ జట్టుది పైచేయిగా ఉంది..పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఏమంటున్నాడనేది తెలుసుకుందాం.


ఎవరెన్నిసార్లు


టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) ఇప్పటి వరకూ ఇండియా పాకిస్తాన్‌లు(India-pakistan)ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో ఐదు సార్లు ఇండియానే విజయం సాధించింది. 2007లో రెండుసార్లు మ్యాచ్ జరుగగా..తొలి మ్యాచ్ టైగా ముగిసింది. అయితే బౌల్ అవుట్‌లో ఇండియా గెలిచింది. అ తరువాత ఫైనల్‌లో 5 పరుగుల తేడా విజయం సాధించి ధోనీ సేన ఛాంపియన్‌గా నిలిచింది. గత మూడు ప్రపంచకప్‌లలో ఇండియా పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. ఇక 2007 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ వరుసగా ఏడవసారి ప్రపంచకప్ ఆడుతున్నాడు. 


పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఏమంటున్నాడు


ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే గత ఫలితాల గురించి తాము ఆలోచించడం లేదని తమకున్న బలాలతోనే మ్యాచ్‌పై దృష్టి సారించామని బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు. బాగా ఆడి గెలవడమే తమ లక్ష్యమన్నాడు. భారత్ తో మ్యాచ్ కోసం నూటికి నూరుశాతం సిద్ధమైనందున ఎలాంటి ఒత్తిడి లేదంటున్నాడు. తమ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉందని చెబుతున్నాడు. యూఏఈ పరిస్థితుల గురించి అవగాహన ఉన్నందున పిచ్ సమస్య లేదంటున్నాడు. టోర్నీకు బయలుదేరే ముందే ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశామని బాబర్ ఆజమ్ చెప్పాడు. ఇమ్రాన్‌తో మాట్లాడటం వల్ల ఆత్మ విశ్వాసం పెరిగిందన్నాడు. 


టీమ్ ఇండియా జట్టు(Team India)


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వృషభ్ పంత్, ఈశాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, ఆర్ ఆశ్విన్, శార్ధూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీలు కాగా..శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్‌లు రిజర్వ్‌లో ఉండనున్నారు. 


పాకిస్తాన్ జట్టు(Pakistan Team)


బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, ఆసిఫ్ అలీ, షోయబ్ మలిక్, సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీ, ఫఖర్ జమా, మొహమ్మద్ హఫీజ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ ఆఫ్రిది, హైరిస్ రవూఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్‌లు కాగా..ఉస్మాన్ ఖాదిర్, షానవాజ్ దహానీ, ఖుషాదిల్ షాహ్‌లు రిజర్వ్‌లో ఉండనున్నారు. 


Also read: India vs Pakistan: ప్రత్యర్ధి దేశాల మధ్య నేడే పోరు, భారీ స్క్రీన్‌లు, భారీగా బెట్టింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook