India vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో సుదీర్ఘకాలం తరువాత తలపడుతున్న దాయాదుల పోరుపై భారీ అంచనాలు..భారీ బెట్టింగ్‌లు, భారీ స్క్రీన్‌లు ఏర్పాటయ్యాయి. బెట్టింగ్‌ల జోరు ఎలా ఉందో చూద్దాం.
ICC T20 World Cup 2021లో అత్యంత ఆసక్తికరమైన, అతి ముఖ్యమైన మ్యాచ్ ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియం వేదికగా జరగనుంది. దాయాది దేశాలు ఇండియా-పాకిస్తాన్‌లు పోటీపడనున్న టీ20 మ్యాచ్ సాయంత్రం 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సుదీర్ఘకాలం అనంతరం జరుగుతున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. 2019 వరల్డ్‌కప్ (2019 World Cup)తరువాత రెండు దేశాల మధ్య ఇదే మ్యాచ్ జరగడం. దాయాదుల మధ్య పోరుపై భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రధాన నగరాలు, పట్టణాల్లోని పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్‌లో ఇండియా-పాకిస్తాన్ (India-pakistan match)మ్యాచ్ లైవ్ ప్రసారం కోసం భారీగా స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌పై అంచనాలకు మించి బెట్టింగ్ జరగనుందని తెలుస్తోంది. భారీగా నగదు చేతులు మారనుంది. దాదాపు వేయికోట్లకు పైగా బెట్టింగ్ జరగవచ్చనేది ఓ అంచనా. టీ20 ఫార్మాట్ ఆదరణ పెరిగే కొద్దీ బెట్టింగ్ స్వరూపమే మారిపోయింది. టాస్ నుంచి ప్రతి బాల్ వరకూ బెట్టింగ్ సాధారణమైపోయింది. యువత టార్గెట్‌గా విస్తరిస్తున్న క్రికెట్ బెట్టింగ్(Cricket Betting)..ఇండియా-పాకిస్తాన్ వంటి మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఇంకా పరిధి దాటేస్తోంది. క్రికెట్ బుకీలు ఇప్పుడు యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ జరగనున్న మ్యాచ్ కోసం బుకీలు..బెట్టింగ్ నిమిత్తం ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నారట. ప్రస్తుతం పాకిస్తాన్‌పై వేయికి 16 వందల రూపాయలైతే..ఇండియాపై వేయికి 5 వందల్నించి 8 వందల వరకూ ఆన్‌లైన్ బెట్టింగ్ నడుస్తోంది. ఇది కాకుండా వ్యక్తిగతంగా ఎవరు ఎంత స్కోర్ సాధిస్తారు, ఎన్ని వికెట్లు సాధిస్తారు వంటివాటిపై విడివిడిగా బెట్టింగ్ నడవనుంది.ఇవాళ జరిగే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో టాస్ గెలిచే జట్టును బట్టి బెట్టింగ్ మారవచ్చు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య మ్యాచ్‌పై 2 వేల కోట్ల బెట్టింగ్ జరిగినట్టు సమాచారం. ఇవాళ జరగే మ్యాచ్‌లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో బెట్టింగ్ జరగవచ్చని తెలుస్తోంది.
Also read: England vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook