ICC Test Rankings: టెస్ట్‌ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ఐసీసీ వెల్లడించింది. ఇటీవల ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తొలిసారి టాప్‌-10లో స్థానం దక్కలేదు. నాలుగు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్‌కు చేరుకున్నాడు. 2016 తర్వాత టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఇటు యువ ఆటగాడు రిషబ్ పంత్‌ తన స్థానాలను మెరుగుపర్చుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టెస్ట్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీతో అలరించాడు. దీంతో అతడు టాప్‌-5లోకి వెళ్లాడు. టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్‌ 10వ స్థానంలో ఉన్నాడు. మ్యాచ్‌ ముగియగానే 5 స్థానానికి ఎగబాకాడు. కరోనా సోకడంతో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారాడు. ప్రస్తుతం టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇంగ్లీష్‌ ప్లేయర్ జానీ బెయిర్ స్టో ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. 


ఒకేసారి 11 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. మొత్తం బ్యాటింగ్‌ విభాగంలో జో రూట్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నెంబర్ వన్‌ స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విభాగంలో తొలి స్థానంలో నిలిచాడు ప్యాట్ కమిన్స్.



Also read:Fraud Case: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..లబోదిబోమంటున్న బాధితులు..!


Also read:CM Jagan Tour: కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..టూర్ షెడ్యూల్ ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook