Fraud Case: హైదరాబాద్‌లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాగోతం బయటపడింది. ఉద్యోగాల పేరుతో యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఆన్‌లైన్ జాబ్..వర్క్ ఫ్రం హెం, యూఎస్ బేసిడ్ కంపెనీ అంటూ చీటింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నెలకు మూడు లక్షల పైనే జీతం ఇస్తామని ఆశ చూపి..ఐదు లక్షల యాభై వేలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని బురిడీ కొట్టించారు.
700 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల మేర డిపాజిట్ కట్టించుకుని డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జెండా ఎత్తేసింది. దీంతో బాధితులంతా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.
బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలంటున్నారు. మరోవైపు మోసపోయిన యువత మాత్రం కన్నీరుమున్నీరవుతోంది. ఉద్యోగం కల్పిస్తామని నమ్మించారని అందుకే భారీగా సొమ్ము మూటజెప్పామంటున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వాపోతున్నారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook