Australia Jonassen: క్రికెట్ అంటేనే అదృష్టం తప్పనిసరిగా తోడవ్వాల్సిన ఆట. ప్రతిభకు అదృష్టం తోడైతే ఇక అద్భుతాలే. అదే జరిగింది. ఐసీసీ విమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో. పట్టిన అద్భుతమైన క్యాచ్ కంటే..ఆ చూపులకే జనం ఫిదా అవుతున్నారు. అర్ధం కాలేదా..లెట్స్ రీడ్ ద స్టోరీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌‌లో జరిగిన అద్భుతం చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి పట్టిన స్టన్నింగ్ క్యాచ్. రెండవది ఆమె విసిరిన ఆ అందమైన చూపులు, విరిసిన ఆ నవ్వు. క్యాచ్‌కు చూపులకు సంబంధమేంటనుకుంటున్నారా.. ఉంది కచ్చితంగా సంబంధముంది. అదేంటో చూద్దాం.


అస్ట్రేలియా-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి..310 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా క్యాథరిన్..జోనాస్సెన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించింది. షాట్ కచ్చితంగానే ఆడింది. మెరుపు వేగంతో వచ్చిన ఆ బాల్‌ను జోనాస్సెన్ ఎడమచేతిని అడ్డుపెట్టి ఆపడానికి ప్రయత్నించే క్రమంలో అదృష్టవశాత్తూ చేతిలో పట్టేసింది. ఇంకేముంది..అందరూ స్టన్నయ్యారు. ఊహించని స్టన్నింగ్ క్యాచ్. మెరుపువేగంతో వచ్చిన బంతిని రెప్పపాటు వేగంతో ఎడమ చేతితో అందుకుంది. అటు బ్యాట్స్‌మెన్, ఇటు ఫీల్డర్లు, ప్రేక్షకులు, కామెంటేటర్లు అందరికీ స్టన్నింగ్ ఇది. ఇదొక అద్భుతమైతే...మరో అద్భుతం స్టన్నింగ్ క్యాచ్ పట్టిన జోనాస్సెన్ స్పందన. క్యాచ్ పట్టిన వెంటనే..క్యాచ్ పట్టానా అనే రీతిలో ఆమె ఇచ్చిన అద్భుతమైన లుక్..ఓ చిరునవ్వు మొత్తం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాయి.


ఆమె పట్టిన క్యాచ్ కంటే ఆమె విసిరిన చూపులే అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆమె పెదాల్లో విరిసిన ఆ చిరునవ్వే అందర్నీ మైమరపించింది. ఆమె చూపులు, ఆమె నవ్వు ఎంత అందంగా ఉన్నాయంటే..కేవలం వాటికోసమే మళ్లీ మళ్లీ చూడాలన్పించేలా చేస్తోంది. అందుకే ఐసీసీ ప్రత్యేకంగా ఈ వీడియోను అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ చేసింది. అప్పుడే 8 లక్షలకు పైగా లైక్స్ లభించాయి. మీరూ ఆమె చూపులు చూస్తారా..ఫిదా అయిపోవల్సిందే మరి. ఆమె నవ్వుకు మైమర్చిపోవల్సిందే.



Also read: Shane Warne: షేన్‌‌వార్న్ మరణానంతరం కూడా వార్తల్లోనే..నివాళిగా సిగరెట్లు, మద్యం, మాంసం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook