Shane Warne: షేన్‌‌వార్న్ మరణానంతరం కూడా వార్తల్లోనే..నివాళిగా సిగరెట్లు, మద్యం, మాంసం

Shane Warne: ఎవరైనా మరణిస్తే అతనికి పూలతో, దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో నివాళి అర్పించడం ఓ ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఆ వ్యక్తి మరణంపై మద్యం, సిగరెట్లతో నివాళి అర్పించారు. ఆ వివరాలివీ..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2022, 09:22 PM IST
  • ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వార్న్...మరణానంతరం కూడా వార్తల్లో
  • షేన్‌వార్న్‌కు నివాళిగా అతనికిష్టమైన బీర్, సిగరెట్లు, మాంసం అర్పిస్తున్న అభిమానులు
  • మెల్‌బోర్న్ స్టేడియం వెలుపల అతని విగ్రహం ముందు పేరుకుపోతున్న బీర్లు, సిగరెట్లు, మాంసం
Shane Warne: షేన్‌‌వార్న్ మరణానంతరం కూడా వార్తల్లోనే..నివాళిగా సిగరెట్లు, మద్యం, మాంసం

Shane Warne: ఎవరైనా మరణిస్తే అతనికి పూలతో, దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో నివాళి అర్పించడం ఓ ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఆ వ్యక్తి మరణంపై మద్యం, సిగరెట్లతో నివాళి అర్పించారు. ఆ వివరాలివీ..

ప్రపంచంలో మేటి స్పిన్నర్‌గా, ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన వ్యక్తి షేన్‌వార్న్. క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. 52 ఏళ్ల వయస్సులో హఠాన్మరణం అందర్నీ కలచివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేన్‌వార్న్ అభిమానులు ఆవేదనకు గురయ్యారు. కన్నీంటిపర్యంతమయ్యారు. ఆస్ట్రేలియాలో అయితే దేశం యావత్తూ నివ్వెరపోయింది. అభిమాన క్రికెటర్ ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురై మరణించాడు షేన్‌వార్న్. మెల్‌బోర్న్ క్రికెట్ స్డేడియం ముందు ఏర్పాటు చేసిన షేన్‌వార్న్ కాంస్య విగ్రహం వద్దకు భారీగా అభిమానులు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ లాంఛనాలతో ఆ క్రికెటర్ తుది వీడ్కోలు పలకనున్నారు. 

మద్యం, సిగరెట్లతో నివాళి

ప్రతిభ ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, వివాదాస్పద వైఖరి ద్వారా వార్తల్లో నిలిచిన షేన్‌వార్న్..మరణానంతరం కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. అతని మరణవార్త విన్న అభిమానులు వివిధ రకాలుగా నివాళి అర్పిస్తున్నారు. వివిధ రకాల పూలతో నివాళి అర్పించడం సాధారణమే. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం షేన్‌వార్న్‌కు ఎంతో ఇష్టమైన వీబీ బ్రాండ్ బీర్, మాంసం, సిగరెట్లను అతని విగ్రహం ముందుంచి..ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అతనికిష్టమైన ఈ పదార్ధాల్నే ఉంచి నివాళి అర్పిస్తున్నారు. అందుకే ఇప్పుడీ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

క్రికెట్‌లో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన షేన్‌వార్న్..చెడు వ్యసనాల కారణంగా వివాదాల్లో నిలిచేవాడు. మద్యం, సిగరెట్లంటే చాలా ప్రీతి. అంతకుమించి స్త్రీ వ్యామోహం ఎక్కువ. క్రికెట్‌లో అత్యధిక వికెట్లతో, అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధుల్ని ముప్పు తిప్పులు పెట్టిన షేన్‌వార్న్..వ్యక్తిగతంగా వివాదాల్లో ఉండేవాడు. కొంతమంది మహిళలు చేసిన ఆరోపణలు ఇప్పటికీ అతని జీవితంలో మచ్చగానే మిగిలాయి. ఇప్పుడు అతని నివాళి సందర్భంగా అభిమానులు మద్యం, సిగరెట్లను ఉంచి నివాళి అర్పిస్తున్న ఫోటోలు సంచలనమవుతున్నాయి. 

Also read: Shane Warne Death Report: షేన్‌వార్న్ మృతిపై థాయ్‌లాండ్ పోలీసుల నివేదిక, ఆసక్తికర విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News