AFG vs AUS: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023లో ఆలస్యంగా ఫామ్‌లోకి వచ్చింది. ఇంగ్లండ్‌పై విజయం తరువాతే సెమీస్ రేసులోకి వచ్చి చేరింది. ఇప్పటి వరకూ 10 పాయింట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా..ఆఫ్ఘనిస్తాన్‌పై విజయంతో నేరుగా సెమీస్‌లో చేరాలని ఆలోచిస్తోంది. అటు ఆఫ్ఘనిస్తాన్..ఇవాళ జరగనున్న మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికాపై గెలిస్తే సెమీస్ స్థానం ఖాయమౌతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఈ రెండు జట్లకు ఇవాళ జరగనున్న మ్యాచ్ చాలా కీలకం. ఆస్ట్రేలియా కంటే ఆఫ్ఘనిస్తాన్‌కు మరింత అవసరం. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖేడ్ స్డేడియంలో జరగనుంది. ఇరు జట్ల బలాబలాలు, పిచ్ రిపోర్ట్, వాతావరణం ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు జరగగా అన్నింటిలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు సాధించాడు. 


ఇవాళ ముంబై వాతావరణం పొడిగా కాస్త వేడిగా ఉండవచ్చు. వర్షం వచ్చే అవకాశమే లేదు. హ్యుమిడిటీ 36 వరకూ ఉండవచ్చని అంచనా. 42 శాతం మేఘాలు ఉన్నా వర్షం మాత్రం పడే అవకాశం దాదాపుగా లేదు. ఇక ఉష్ణోగ్రత 27-37 డిగ్రీల మధ్యలో ఉండవచ్చు.


ముంబై వాంఖేడ్ పిచ్ ఎలా ఉంటుంది


ముంబై వాంఖేడ్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా పిలుస్తారు. భారీ స్కోరుకు అవకాశాలున్న పిచ్ ఇది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రేలియా ఈ పిచ్‌పై ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు ఇండియాతో ఆడినవే కావడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ పిచ్‌పై తొలిసారిగా ఆడుతోంది. 


ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 అంచనా


డేవిడ్ వార్నర్, టీమ్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్ చానే,  జేపీ ఇంగ్లిస్, సి గ్రీన్, ఎంపీ స్టోయినిస్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఏ జంపా, జోష్ హాజిల్‌వుడ్


ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 అంచనా


రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, ఆర్ షాహ్, హస్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఐఏ ఖిల్, మొహమ్మద్ నబి, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖి, నూర్ అహ్మద్


Also read: Afghan vs Aus: ఆఫ్ఘన్ వర్సెస్ ఆసిస్ కీలక మ్యాచ్ నేడే, ఆ జట్టు ఓటమి కోరుకుంటున్న పాక్, కివీస్ జట్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook