Afghan vs Aus: ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబై వాంఖేడ్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్‌కు చేరుకోగా మిగిలిన రెండు స్థానాలకై నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో రెండు జట్లకు ఇవాళ కీలక మ్యాచ్ ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023లో అద్భుతాలు జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కధ ముందే ముగిసింది. శ్రీలంక పరాజయాలు మూటగట్టుకుంటోంది. నెదర్లాండ్స్ పరిస్థితి అదే అయినా దిగ్గజ జట్లను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ నాలుగు జట్లలో ఆస్ట్రేలియా దాదాపుగా సెమీస్‌కు చేరినట్టే కన్పిస్తోంది. మరో మ్యాచ్ నెగ్గితే చాలు. అందుకే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై గెలిచి ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఇక మరోవైపు అనూహ్య ప్రదర్శన కనబరుస్తూ ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ కూడా సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. 


ఆస్ట్రేలియా మూడవ సెమీస్ స్థానానికి దాదాపుగా చేరుకున్నట్టే. అందుకే ఇప్పుడు నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘన్ జట్టుకు ఇవాళ్టి మ్యాచ్ కాకుండా మరో మ్యాచ్ మిగిలుంది. ఇవాళ ఆస్ట్రేలియాతో , తరువాత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రెండూ బలమైన జట్లు కావడంతో కాస్త ఇబ్బందికర పరిణామమైతే ఉంది. కానీ ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ నేరుగా నాలుగో జట్టుగా సెమీస్ చేరుకోవడం ఖాయం. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఇంటికి చేరుకుంటాయి. ఎందుకంటే 7 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే 4 మ్యాచ్‌లలో విజయం సాధించి 8 పాయింట్లతో ఉంది. మిగిలిన రెండు గెలిస్తే 12 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుకుంటుంది. 


అదే 8 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే మిగిలుంది. వాటిలో గెలిచినా 10 పాయింట్లే దక్కుతాయి. అందుకే ఈ రెండు జట్లు ఇవాళ్టి మ్యాచ్‌పై కన్నేశాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఓటమి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు అవసరం. అదే సమయంలో ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ఆస్ట్రేలియా నేరుగా సెమీస్ చేరిపోనుంది. 


ఈ ప్రపంచకప్‌లో తొలుత ఇంగ్లండ్‌ను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తరువాత న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ తరువాత అద్భుతంగా పుంజుకుంది. పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించి సెమీస్ రేసులో వచ్చి చేరింది. ఆఫ్ఘనిస్తాన్‌కు స్పిన్ బలమైతే ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ బలంగా ఉంది. సెమీపైనల్ కలను సజీవంగా ఉంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ్టి మ్యాచ్‌లో సంచలనం రేపుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. 


Also read: Angelo Mathews: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ మ్యాథ్యూస్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి టైమ్ ఔట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook